ఐటీడీఏ వద్ద నాలుగో రోజు కొనసాగిన దీక్షలు
పాడేరు: విశాఖ మన్యాన్ని అందాల కశ్మీర్‌గా అభివర్ణిస్తూనే బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి విధ్వంసానికి పూనుకుంటోందని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ధ్వజమెత్తారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక విద్యార్థులతో సోమవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఉన్న చట్టాలను అమలు చేయని ప్రభుత్వం 97 జీవోను ఇచ్చి 40 ఏళ్ల పాటు మన్యంలో ఏపీఎండీసీ అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. బాక్సైట్ వ్యతిరేకంగా మహోద్యమానికి 28 సంఘాలతో బాక్సైట్ వ్యతిరేక వేదిక ఏర్పడిందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో చ ర్చించి 97జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు రామరావు దొర మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోం దని విమర్శించారు.
గిరిజనుల ఆందోళనలపై ప్రభుత్వాలు స్పందించి బాక్సైట్ తవ్వకాలను విరమించకుంటే మన్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్ మాట్లాడుతూ బాక్సైట్ వ్యతి రేక ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాల వలన మన్యం సర్వనాశనమవుతుందని పంటలు నశిస్తాయని, తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక ప్రతినిధులు సూర్యనారాయణ, రాజ్‌కుమార్, కృష్ణారావు, ఎం.ఎం.శ్రీను, పాలికి లక్కు, రాధకృష్ణ, సుందర్‌రావు, వంతాల రాంబాబులతో పాటు పట్టణంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
బాక్సైట్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ
Published Mon, Nov 16 2015 11:19 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement