ర్యాంపుల్లో యథేచ్ఛగా దందా
అక్రమంగా తరలిపోతున్న ఇసుక
కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం
‘దోచుకున్న వాడికి దోచుకున్నంత..’ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఇసుక వ్యాపారం. నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను దొరకని ముడిసరుకుగా మార్చేయడంతో అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా దండుకుంటోంది. ప్రభుత్వ అనుమతి ఉందనే సాకు చూపిస్తూ ర్యాంప్‌ల వద్ద ఎవరికి దొరికినంత వారు దోచేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు.
చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అనధికార ర్యాంప్‌లతో పాటు అధికార ర్యాంప్ వద్ద కూడా అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. శారదా, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇసుక వ్యాపారం జరుగుతోంది. శారదానదిలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, ముద్దుర్తి, రాయపురాజుపేట ,కలిగొట్ల, బోయిల కింతాడ, తారువ, మల్లంపాలెం, లక్కవరం, భోగాపురం వద్ద, బొడ్డేరు, పెద్దేరు నదుల్లో విజయరామరాజుపేట, జన్నవరం వీరనారాయణం, వీరవిల్లి అగ్రహారం, మాడుగుల, బెన్నవోలు, పీఎస్‌పేట, అంకుపాలెంలక్ష్మీపురం కల్లాలు వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇసుకను పిండి కోట్లు దండి
Published Mon, Feb 22 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM
Advertisement