సవరించిన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం రూ.954.77 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతలో రూ.96.69 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ ప్రధాన కాల్వ, పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.549.60 కోట్లకు, ఉప పంపిణీ వ్యవస్థల కోసం రూ.83.77 కోట్లకు 2008 జూన్‌లో అనుమతిచ్చారు. మొత్తంగా రూ.633.54 కోట్లతో 155 కిలోమీటర్ల మేర కాల్వలను 2015 నాటికి ఆధునికీకరణ చేయాలని నిర్ణరుుంచారు. మధ్యలో ఈ మొత్తాలను సవరించి వ్యయాన్ని రూ.742.82 కోట్లకు పెంచారు. తర్వాత మరిన్ని పనులను చేర్చడంతో వ్యయం రూ.954.77కోట్లకు పెరిగింది.
నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.954 కోట్లు
Published Fri, Nov 18 2016 3:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
Advertisement