![TSPSC AE Recruitment 2022 704 Vacancy Likely To Release Soon - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/18/EMPLOY-5._0.jpg.webp?itok=N59p3VB9)
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ (84), సివిల్ (320), అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (100), ఎలక్ట్రికల్ (200) విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభా గాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హుల వుతారు.
ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్–1కు, 445 పోస్టులు మల్టీ జోన్–2 కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్ (182), మెకానికల్ (45) పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు మల్టీ జోన్–1కు, 115 పోస్టులు మల్టీజోన్–2 కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రుల తో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment