న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లను ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను వ్యక్తిగత విద్యుత్ వాహనాలకు, పసుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను ట్యాక్సీలకు కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు.
ట్యాక్సీ వినియోగదారులకు సమానంగా ఈ–వాహనాల వినియోగాన్ని పెంచేలా 16–18 మధ్య వయసున్న వారు కూడా విద్యుత్ స్కూటర్లు నడిపేందుకు అనుమతినిచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ప్లేట్లున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పార్కింగ్‌లోనూ ప్రాధాన్యత ఉండటంతోపాటు రద్దీ ప్రాంతాల్లోనూ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. టోల్‌గేట్ పన్నులో కూడా రాయితీ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment