number plates
-
విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..
రోడ్లపై నిత్యం విభిన్న రకాల వాహనాలను గమనిస్తుంటాం. అందులో కొన్ని వెహికిల్స్ నంబర్ప్లేట్లు(Number Plate) సాధారణంగా కాకుండా భిన్నంగా ఉంటాయి. వాటిపై నంబర్లు, రంగులో తేడా ఉండడం గమనిస్తుంటాం. కొన్ని నంబర్ప్లేట్లు తెలుపు రంగులో ఉంటే, మరికొన్ని ఆకుపచ్చ రంగులో, ఇంకొన్ని పసుపు రంగులో.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. అయితే ఒక్కో రంగు ప్లేట్ వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.తెలుపు రంగు ప్లేట్ఈ ప్లేట్లను వాణిజ్యేతర వాహనాలకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కనిపిస్తాయి. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఇది ప్రైవేట్ యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు.ఆకుపచ్చ నంబర్ ప్లేట్పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్(Green Plate) నంబర్ ప్లేట్లు కేటాయించారు. అవి తెల్లని అక్షరాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఈ-రిక్షాలు, బస్సులు వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు.పసుపు రంగు ప్లేట్పసుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఈ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలను అద్దె కోసం ఉపయోగించుకోవచ్చు.బ్లూ నంబర్ ప్లేట్విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు తెలుపు అక్షరాలతో బ్లూ కలర్ ప్లేట్లు కేటాయిస్తారు.ఎరుపు రంగు ప్లేట్ఎరుపు రంగు ప్లేట్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న వాహనాన్ని సూచిస్తుంది. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది.పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్ఈ ప్లేట్లు సైనిక వాహనాలకు చెందినవి. వాహనం కొనుగోలు చేసిన సంవత్సరంతో పాటు పైకి సూచించే బాణాన్ని కలిగి ఉంటాయి. ఈ నంబరింగ్ సిస్టమ్ రక్షణ మంత్రిత్వ శాఖకు(Defence) ప్రత్యేకమైంది.జాతీయ చిహ్నంతో ఎరుపు రంగు ప్లేట్భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఉపయోగించే వాహనాలు భారత జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు పలకను కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?భారత్ నంబర్ ప్లేట్రాష్ట్రాల మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా భారత్ నంబర్ ప్లేట్‌ను 2021లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేరే రాష్ట్రానికి వెళ్లేటప్పుడు మళ్లీ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, దేశ వ్యాప్తంగా బహుళ కార్యాలయాలు కలిగిన కంపెనీల్లో పని చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
ఒక్కసారిగా పెరిగిన నెంబర్ ప్లేట్స్ ధరలు.. ఎన్ని లక్షలంటే?
సాధారణ వెహికల్ నెంబర్ ప్లేట్స్ కంటే కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ సొంతం చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వీఐపీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఫీజును భారీగా పెంచింది. ఎంచుకునే నెంబర్ సిరీస్‌లను బట్టి వీటి ధరలు రూ. 18 లక్షల వరకు ఉండవచ్చు. 2013 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీఐపీ నంబర్ ప్లేట్ ధరను పెంచడం ఇదే తొలిసారి.మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లలో ఒకటైన '0001' కోసం ఎదురు చూసే కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫోర్ వీలర్ కోసం ఈ నెంబర్ కొనుగోలు చేయాలంటే రూ. 6 లక్షలు, టూ వీలర్ లేదా త్రీ వీలర్ కోసమయితే రూ. 1 లక్ష అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కూడా నగరాన్ని బట్టి ఉంటాయి. ఈ జాబితాలో ముంబై, ముంబై సబర్బన్, పూణే, థానే, రాయగడ, ఔరంగాబాద్, నాసిక్, కొల్హాపూర్, నాసిక్ ఉన్నాయి.ధరల పెరుగుదలకు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్ ధర రూ. 12 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు రూ. 6 లక్షలు పెరగడంతో ఇది రూ. 18 లక్షలకు చేరింది. ఈ నెంబర్ కొనుగోలు చేసిన తరువాత జీవిత భావస్వామికి, కొడుకు, కూతుళ్ళకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.మహర్షత్రలో వీఐపీ నెంబర్ ప్లేట్లతో 240 వాహనాలు ఉన్నాయి. ఇందులో చాలావరకు '0009', '0099', '0999', '9999', '0786' మొదలైన సిరీస్ నెంబర్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా ఈ వీఐపీ నెంబర్ ప్లేట్ ఫీజుల విధానంలో మార్పు చేయడం జరిగింది.వీఐపీ నెంబర్ ప్లేట్లకు ఎందుకు డిమాండ్నెంబర్ ప్లేట్ అనేది.. వాహన రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. అయితే కొందరు సెంటిమెంట్ లేదా స్టేటస్ తెలియజేసుకోవడానికి వీఐపీ నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తుంటారు. వీఐపీ నెంబర్ ప్లేట్స్ ధరలు మన దేశంతో పోలిస్తే.. దుబాయ్‌లో చాలా ఎక్కువ.ప్రపంచంలో ఖరీదైన నెంబర్ ప్లేట్ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ 'పీ7'. ఇది దుబాయ్ దేశానికీ చెందిన నెంబర్ ప్లేట్. దీని ధర 15 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 125 కోట్లు కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే నెంబర్ ప్లేట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?మన దేశంలో కూడా కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ తన లంబోర్ఘిని కారు నెంబర్ కోసం రూ. 17 లక్షలు కాచు చేశారు. మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తన గ్యారేజిలోని అన్ని కార్లకు 369 అనే నెంబర్ ఎంచుకుంటారు. దీనికోసం కూడా అయన ఎక్కువ ఖర్చు చేస్తారు. -
నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే..
అతడో ధనవంతుడు.. పైగా ఓ పెద్ద కంపెనీని యజమాని.. కార్లంటే ఎంతో ఇష్టం.. నచ్చిన కారు నంబర్‌ప్లేట్ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం.. అయనే భారత మూలాలున్న దుబాయిలో నివసిస్తున్న అబుసల్హా(బల్విందర్‌సింగ్ సాహ్నీ). ఆయనకు నచ్చిన కారు నంబర్‌ప్లేట్‌కు ఏకంగా రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కార్లపై తనకున్న ఆసక్తి ఎలాంటిదో ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయిలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న బల్విందర్‌సింగ్ సాహ్నీ(అబుసల్హా) రాజ్ సాహ్ని గ్రూప్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బల్విందర్‌సింగ్ సాహ్నీకి కార్లంటే చాలా ఇష్టం. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఖరీదైన కార్లలోని కల్లినన్స్, ఫాంటమ్ VIII సెడాన్ వంటి మోడళ్లు సాహ్నీ గ్యారేజ్‌లో ఉన్నాయి. అతడి వద్ద ఎన్నో అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ కార్లు ఉన్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కార్లతో పాటు తనకు నచ్చిన నంబర్ప్లేట్లను ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేయడం తనకు అలవాటని తెలిపారు. అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్లు తనవద్ద ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని కార్ల వాస్తవ ధరకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్ సాహ్నీ వద్ద రూ.6 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాటికి సింగిల్ డిజిట్(1), కొన్నింటికి డబుల్ డిజిట్ నంబర్‌ప్లేట్ తీసుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఒక్కోకారుకు దాదాపు రూ. రూ.60 కోట్లు నుంచి రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాహ్నీ సుమారు రూ.10 కోట్లు వెచ్చించి రోల్స్‌రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు ఏకంగా సుమారు రూ.141 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ నంబర్‌ప్లేట్‌పై ‘DUBAI D 5’ అని ఉంటుంది. తన వద్ద సింగిల్ డిజిట్ నంబర్‌తో మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కూడా ఉన్నట్లు చెప్పారు. బెంట్లీ రూపొందించిన ఖరీదైన కస్టమ్ ఫర్నిచర్ సైతం తన ఇంట్లో ఉందని సాహ్నీ అన్నారు. -
మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?
జపాన్ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌గా అవతరించింది. దేశీయంగా వివిధ విభాగాలలో వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అమెరికా, చైనా తరువాత భారత్ ప్రముఖంగా నిల్తుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వాహనాల రక రకాల నెంబర్ ప్లేట్స్, ఎందుకు ఉపయోగిస్తారు? తెలుసుకుందాం! సాధారణంగా వాహనాలపై డిఫరెంట్ కలర్స్ గల నెంబర్ ప్లేట్స్ మనం చూస్తూ ఉంటాం. పలు రంగలుల్లో, ముఖ్యంగా గ్రీన్ కలర్లో ఉండే నెంబర్ ప్లేట్లను ఎపుడైనా చూశారా? తెలుగు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల నెంబర్ ప్లేట్లు భారతదేశంలో ఉపయోగిస్తారు? అలాగే ప్రతి వాహనం ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉంటుంది. ప్లేట్‌పై లాటిన్ అక్షరాలు , అరబిక్ నెంబర్లు బొమ్మల కలయికతో ఉంటాయి. ఎక్కువగా వైట్ నెంబర్ ప్లేట్స్ పై బ్లాక్ లెటర్స్, పసుపు రంగు బోర్డు పై నల్ల అక్షరాలు లెటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. తెల్లని నంబర్ ప్లేట్ ఇది భారతదేశంలో కనిపించే అత్యంత సాధారణ లైసెన్స్ ప్లేట్ రకం. రిజిస్ట్రేషన్ వివరాలు తెలుపు , నలుపు రంగులో ముద్రించబడతాయి. ఈ రకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వాహనాలపై కనిపిస్తుంది. అద్దెకు తీసుకోవడం లేదా సరుకు రవాణా వంటి వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించలేరు. పసుపు నంబర్ ప్లేట్ తేలికపాటి మోటారు వాహనాలకు ఇవి వర్తిస్తాయి. ఈ వాహనాలు ప్రైవేట్ వాహనాల కంటే భిన్నమైన పన్ను ప్లేట్స్ కలిగి ఉంటాయి. ఇంకా, అటువంటి వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. రెడ్ నంబర్ ప్లేట్ తాత్కాలికి రిజిస్ట్రేషన్ ప్లేట్. తెలుపు అక్షరాలతో ఎరుపు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వివరాలు టెంపరరీని సూచిస్తుంది. RTO రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందే వరకు భారతదేశంలో రెడ్ నంబర్ ప్లేట్ ఉంటుంది. అయితే, రెడ్ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా రాష్ట్రాలు ఇలాంటి వాహనాలను తమ రోడ్లపైకి అనుమతించవు. ఆకుపచ్చ నంబర్ ప్లేట్ మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV)లకు బాగా ఆదరణ పెరుగుతోంది. ఈవీలకు కేటాయించే నెంబర్ ప్లేట్ గ్రీన్లోఉంటుంది. అందుకే దేశంలో గ్రీన్ నంబర్ ప్లేట్లు పెరుగుతున్నాయి. తెలుపు అక్షరాలతో ఉన్న అన్ని EVలు ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. అయితే పసుపు అక్షరాలు ఉన్నవి కమర్షియల్ EVలకు ప్రత్యేకం. బ్లూ నంబర్ ప్లేట్ విదేశీ డిప్లొమేట్స్ వారు ఉపయోగించే వాహనాలకు వైట్ లెటర్స్‌తో బ్లూ నెంబర్ ప్లేట్స్ ను అందజేస్తారు. ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రధానంగా మూడు కోడ్లలో దేనినైనా కలిగి ఉంటాయి- CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్), లేదా CD (కార్ప్స్ డిప్లొమాటిక్). రాష్ట్ర కోడ్‌ను ప్రదర్శించడానికి బదులుగా, ఈ నంబర్ ప్లేట్లు దౌత్యవేత్తకు సంబంధించిన దేశ కోడ్‌ను తెలుపుతాయి. పైకి సూచించే బాణంతో నంబర్ ప్లేట్ ఇటువంటి నంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా సైనిక ప్రయోజనాల కోసం వాడతారు. రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద నమోదవుతాయి. మొదటి లేదా రెండవ అక్షరం తర్వాత పైకి చూపే బాణాన్ని బ్రాడ్ బాణం అంటారు. బాణం తర్వాత వచ్చే అంకెలు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తదుపరిది బేస్ కోడ్, దాని తర్వాత క్రమ సంఖ్య. సీరియల్ నంబర్ తర్వాత వచ్చే చివరి అక్షరం వాహనం తరగతిని సూచిస్తుంది. మిలిటరీ వెహికల్ నంబర్ ప్లేట్ భారతదేశ అశోకా చిహ్నంతో కూడిన నంబర్ ప్లేట్లు భారత రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్లకు మాత్రమే ప్రత్యేకం. బ్లాక్ నంబర్ ప్లేట్ పసుపు అక్షరాలతో నలుపు రంగు నంబర్ ప్లేట్ సాధారణంగా విలాసవంతమైన హోటల్‌కు సంబంధించి లగ్జరీ కార్లకు కేటాయిస్తారు. అలాంటి వాహనాలను డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండనవసరం లేకుండానే వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తారు. భారత్ సిరీస్ వివిధ రాష్ట్ర కోడ్లతో పాటు, ఒక సాధారణ పౌరుడు తన వాహనం కోసం 'BH' లేదా భారత్ సిరీస్ లైసెన్స్ ప్లేట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అలాగే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న సంస్థల ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BH-సిరీస్-వాహనం-రిజిస్ట్రేషన్ వాహనం యజమాని కొత్త రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మకాం మార్చినప్పుడు, వాహనాన్ని తిరిగి నమోదు చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడం ద్వారా అంతర్-రాష్ట్ర చలనశీలతను సులభతరం చేయడానికి ఈ నంబర్ ప్లేట్ తీసుకొచ్చారు. -
కారు రిజిస్టర్ నెంబర్ ఖరీదు రూ. 6 లక్షలు - ఆ నెంబర్ ఏదంటే?
Mahindra Scorpio N: ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా వాహనాలన్నా, నెంబర్ ప్లేట్స్ అన్నా ఎక్కువ క్రేజుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు కొనుగోలు చేసే వాహనాలకు కూడా అంతకు మించి డబ్బు వెచ్చించి నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 6 లక్షల నెంబర్ ప్లేట్ నివేదికల ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో కారుకి ఏకంగా రూ. 6 లక్షలు వెచ్చించి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాకుండా తన కారు చూసేవారిని వెంటనే ఆకట్టుకోవాలని ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో తరుణ్ వ్లాగ్స్3445 అనే తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే మహీంద్రా స్కార్పియో 'RSY 0017' అనే ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ చూడవచ్చు. ఇది సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లకు భిన్నంగా ఉంది, ఈ కారణంగానే దీనికి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ SUV దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందింది. ఇక్కడ వీడియోలో కనిపించే కారు స్కార్పియో ఎన్ Z4 ట్రిమ్ పెట్రోల్ మోడల్ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అక్షరాలా రూ. 122 కోట్లు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 200 బీహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.05 లక్షలు, కాగా Z4 ట్రిమ్ పెట్రోల్ ధర రూ. 14.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). -
‘ప్లేట్’ ఫిరాయించొద్దు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చోదకులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్‌లో మార్పు చేర్పులు చేయవద్దని కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ట్వీట్ చేశారు. సక్రమంగా లేని నంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను ఎక్కువగా నేరగాళ్లు వినియోగిస్తున్న ఆనవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ తరహా వాహనాలు వినియోగిస్తూ అనేక మంది దాదాపు 2 వేల స్నాచింగ్స్ చేశారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే నగరంలో వాహనాల నంబర్ ప్లేట్స్‌పై ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నామని మంగళవారం ఒక్క రోజే 384 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ తరహా నంబర్ ప్లేట్లను గమనిస్తే 94906 16555కు వాట్సాప్ చేయాలని నగర వాసులకు కొత్వాల్ సూచించారు. (కెమెరాకు చిక్కితే చెక్ పడుద్ది) Improper number plate on Bike could be an indicator that the rider is an offender of snatching. We have records of 2000 plus offenders who use bike to commit chain/cell snatching . Yesterday we booked 384 cases against those using improper number plates. Pl send pic at 9490616555 — Anjani Kumar, IPS (@CPHydCity) March 11, 2020 -
చలాన్ పెండింగ్.. ఈ కెమెరాకు చిక్కితే అంతే..
కొత్తపేటకు చెందిన దంపతులు ఫిబ్రవరి ఒకటిన మలక్‌పేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో కొందరు దుండగులు వారి దృష్టి మళ్లించి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ కేసును ఏఎన్పీఆర్ సిస్టం ద్వారానే కొలిక్కి తెచ్చారు.బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైంది. కాగా ట్రాఫిక్ పోలీసులు ఏఎన్పీఆర్ సాఫ్ట్వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. సాక్షి, సిటీబ్యూరో: ఈ–చలాన్ భారీగా బకాయిలు ఉండి స్వేచ్ఛగా విహరిస్తున్న వాహనాలు.... ఓ పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురై మరో ఠాణా పరిధిలో తిరిగేస్తున్న వెహికిల్స్... ఓ జోన్ పరిధిలోని నేరంలో వాంటెడ్‌గా ఉన్నప్పటికీ మరో జోన్లో సంచరించే వాహనాలు... పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. ఇకపై వీటికి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్(ఏఎన్పీఆర్) అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన కెమెరాలు చెక్ చెబుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు దీన్ని ఏర్పాటు చేశారు. సిటీలోని 250 జంక్షన్లలోని కెమెరాల్లో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 13 కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి ఉపకరించింది. సాఫ్ట్వేర్ ఆధారిత పరిజ్ఞానం... ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ పూర్తి సాఫ్ట్వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ట్రాఫిక్ విభాగం వద్ద ఉన్న పెండింగ్ ఈ–చలాన్ల డేటాబేస్, సీసీఎస్ ఆధీనంలోని చోరీ వాహనాల డేటాబేస్‌తో పాటు వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాహనాల నెంబర్లతో కూడిన డేటాబేస్‌నూ ఈ సర్వర్‌కు అనుసంధానించారు. నగర వ్యాప్తంగా అనేక జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను ఈ సర్వర్‌కు సింక్రనైజ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండనున్న నేపథ్యంలో 24 గంటలూ నిర్విరామంగా ఈ సర్వర్ పని చేస్తూనే ఉంటుంది. నగర వ్యాప్తంగా ఉండే ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల ముందు ఈ మూడు తరహాలకు చెందిన వాహనాల్లో ఏది వచ్చినా... సర్వర్‌లో ఉన్న సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు ఆ విషయాన్ని తక్షణం గుర్తిస్తాయి. ఏ ప్రాంతంలో ఉన్న కెమెరా ముందుకు ఆ వాహనం వచ్చిందనే వివరాలను కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి భారీ స్క్రీన్‌పై పాప్అప్ రూపంలో అందిస్తాయి. దీంతో అప్రమత్తమయ్యే అక్కడి సిబ్బంది ఆ కెమెరా ఉన్న ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా సదరు వాహనచోదకుడిని పట్టుకునేలా చేస్తున్నారు. ప్లేట్లలో కచ్చితత్వం తప్పనిసరి... ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఏ తరహాకు చెందిన, ఏ పరిమాణంలో ఉండాలనేది మోటారు వాహనాల చట్టం స్పష్టంగా నిర్దేశించింది. ప్రస్తుతం నగరంలోని వాహనచోదకులు దీన్ని పూర్తిస్థాయిలో పట్టించుకోవట్లేదు. ఫలితంగా నెంబర్ ప్లేట్లు, వాటిలో ఉండే అక్షరాలు, అంకెలు తమకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నెంబర్ ప్లేట్లపై ఉన్న అంకెలు, అక్షరాలను అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ పని చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు నెంబర్ ప్లేట్లలో కచ్చితత్వం ఉండేలా, మోటారు వాహనాల చట్టం నిర్దేశించినట్లే అవి ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్నారు. వాహనాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ఇది కచ్చితంగా మారి, అన్ని వాహనాలకు అమలైతే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ నెంబర్ ప్లేట్లలో యూనిఫామిటీ ఉండటంతో సాఫ్ట్వేర్ కచ్చితంగా గుర్తించడంతో పాటు పొరపాట్లకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. కొలిక్కి వచ్చిన కేసుల్లో కొన్ని... ♦ జనవరి 31న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతికి కారణమైన తేలికపాటి వాహనాన్ని గుర్తించారు. ♦ జనవరి 5న రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ వాహనం నెంబర్ ఆధారంగా దాని కదలికలు పాతబస్తీలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద గుర్తించి పట్టుకున్నారు. ♦ బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా సంచరిస్తున్న ఓ ఆటో గతంలో చోరీకి గురైందిగా ట్రాఫిక్ పోలీసులు ఈ సాఫ్ట్వేర్ వినియోగించి గుర్తించారు. దీన్ని రికవరీ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. -
నంబర్ ప్లేట్లు ఒకేలా ఉండాలి
సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకు అమర్చే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై ఇష్టారీతిన ఫ్యాన్సీ లెటర్లు, ఇతర గుర్తులు వాడరాదని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ నంబర్ ప్లేట్ల తయారీదారులను హెచ్చరించారు. సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989 ప్రకారం నంబర్ ప్లేట్లు రూపొందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాంపల్లిలోని ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో వాహనాలకు రిజిస్ట్రేషన్ నం బర్ ప్లేట్లు తయారీదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంబర్ ప్లేట్ తయారీదారులు తమ వద్దకు వచ్చే కస్టమర్ ఒరిజినల్ ఆర్సీ, యజ మాన్య వివరాలు తీసుకోవడంతో పాటు సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989పై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఒక సర్క్యు లర్ జారీ చేశారు. సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ– 1 ఎల్ఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పట్టుకోండి చూద్దాం..!
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): శంషాబాద్ పట్టణానికి చెందిన రమేష్ నిత్యం ద్విచక్రవాహనంపై తన అవసరాల నిమిత్తం స్థానికంగా తిరుగుతుంటాడు. ఇటీవల బెంగళూరు జాతీయ రహదారిని దాటే క్రమంలో అతడు హెల్మెట్ ధరించని కారణంగా పలుమార్లు ట్రాఫిక్ చలాన్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తన మదిలో ఓ ఆలోచన తట్టింది. వాహనానికి వెనక ఉన్న నంబర్ ప్లేటుపై ఒక అంకెను తొలగించాడు. ఇంకేముంది.. ఇప్పుడు తలపై హెల్మెట్ లేకున్నా దర్జాగా రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నాడు. ఇది ఒక రమేష్ విషయమే కాదు. శంషాబాద్ పట్టణంలో నిత్యం చాలామంది వాహనదారులు ఇదే తరహాలో ట్రాఫిక్ నిబంధనలపై నీళ్లు చల్లుతూ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. నాలుగుచక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలి. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు గుర్తించి చలాన్లు విధిస్తుంటారు. శంషాబాద్ పట్టణంలో బెంగళూరు జాతీయ రహదారిపై రెండు చోట్ల ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను పోలీసులు నియంత్రిస్తుంటారు. దీంతోపాటు ఇక్కడ నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిఘా వేస్తుంటారు. ఇందులోభాగంగా.. ట్రాఫిక్ సిబ్బంది చేతిలో ఉన్న కెమెరాతో ఉల్లంఘనుల వాహనాల ఫొటోలను తీసి వాటి ఆధారంగా చలాన్లు విధిస్తున్నారు. అయితే, చలాన్లను తప్పించుకునేందుకు, తమ వాహనాల వివరాలు తెలియకుండా.. అక్రమార్కులు నంబర్ ప్లేట్లపై అంకెలను తొలగించి లేదా తారుమారు చేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో దర్జాగా తప్పించుకుంటున్నారు. దీంతో ఉల్లంఘనదారులకు విధించే చలాన్లను వాహనదారుల చిరునామాలకు పంపించలేకపోతున్నారు. వాహనదారుల పాట్లు పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వాహనదారులు వివిధ పనుల నిమిత్తం ప్రధాన వీధుల్లో వా హనాలపై తిరుగుతుంటారు.ముఖ్యంగా పట్టణం జాతీయ రహదారికి రెండు వైపులా ఉండడం.. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వారు జాతీయ రహదారి దాటాల్సి ఉంటుంది. ఏ చిన్న పని ఉన్నా ద్విచక్రవాహనాన్ని వినియోగించక తప్పడం లేదు. కొద్దిదూరం కోసం హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకని చాలామంది మామూలుగానే వాహనంపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. వీటితో విసిగిపోతున్న వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొత్తదారులు వెతుకుతున్నారు. నంబరు ప్లేట్లపై అంకె లేదా అక్షరం తొలగించడం.. పూర్తిగా నంబర్ కనిపించకుండా ప్లేట్లుపై స్టిక్కర్లు అతికించడం, నంబరు ప్లేటును మడతపెట్టడం తదితర పనులు చేస్తున్నారు. నిందితులను గుర్తించడం కష్టమే.. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు నంబరు ప్లేట్లపై మార్పులు చేస్తుండగా.. వీరి ముసుగులో నేరస్తులు తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా నేరం చేయడానికి వాహనాలపై వచ్చిన నిందితులు ఇలాగే నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడితే.. ఆయా కేసులను ఛేదించడం పోలీసులకు ఇక సవాల్‌గానే మారుతుంది. అయితే, వాహ నాల నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొలగించిన వాహనదారులు నిత్యం పోలీసుల ఎదుటే తిరుగుతున్నా వారు దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిఉ్తన్నాయి. మరోవైపు శంషాబాద్ పట్టణంలో పార్కిగ్ సమస్య జఠిలంగా మారింది. నో పార్కింగ్ ఏరియాలో, ప్రధాన వీధుల వెంబడి నిలిపే వాహనాల ఫొటోలను సేకరించి పోలీసులు చలాన్లు విధిస్తుండగా.. నంబర్లు సరిగా లేని వాహ నదారులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. వాహనాన్ని సీజ్ చేస్తాం వాహనాలకు నంబరు ప్లే ట్లు నిబంధనల మేరకు ఉండాలి. నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొల గించిన వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. నిబంధనల మేరకు నడుచుకోకపోతే చర్యలు తప్పవు. – జి.నారాయణరెడ్డి,ట్రాఫిక్ సీఐ, శంషాబాద్ -
ప్లేటు మారిస్తే మోతే..
సాక్షి, సిటీబ్యూరో: వివిధ ఆకారాలు, వాటిపై వివిధ డిజైన్లు, పదాలు, అక్షరాలు, అంకెలు... ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి. దీనికి చెక్ చెప్పేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. నెంబర్ ప్లేట్లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించినట్లు మాత్రమే ఉండాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పు నెంబర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయన్నారు. ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ సహా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 50, 51 ఉల్లంఘించడమే అని అనిల్‌కుమార్ వివరించారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు గమనించిన ప్రజలు సైతం స్పందించాలన్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్బుక్, ట్విటర్లతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా పేర్కొనాలి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనకు సంబంధించి గడిచిన రెండు నెలల్లోనే 20,260 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. నిబంధనలు ఇవీ... ♦ ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపురంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ♦ ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికారుల సహాయంతో డ్రైవింగ్ లైసె న్స్ సైతం రద్దయ్యే చర్యలు తీసుకుంటారు. ♦ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200్ఠ100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340్ఠ200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. -
ఓ కారు... నాలుగు నంబర్లు
పెదబయలు(అరకులోయ): ముంచంగిపుట్టలో నాలుగు వేర్వేరు నంబర్లతో తిరుగుతున్న ఓ కారును పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఈ కారును ఆపగా అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారని ఎస్ఐ అరుణ్‌కిరణ్ తెలిపారు. కారును తనిఖీ చేసి, స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఏపీ, మహారాష్ట్రకు చెందిన నాలుగు నంబర్ప్లేట్లతో ఈ కారు తిరుగుతున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ 31బి 9229, మహారాష్ట్ర 20బీసీ 2794తో పాటు మరో రెండు నంబర్ ప్లేట్లు ఈ కారులో ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ కారు గంజాయి స్మగ్లర్లదా? లేక ఇతర పనులకు ఉపయోగిస్తున్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే నంబర్.. రెండు కార్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం, పెనుకొండ: పెనుకొండ ప్రాంతంలో ఒకే నంబరు ప్లేటుతో రెండు కార్లు తిరుగుతున్నాయి. పట్టణానికి చెందిన సురేష్‌బాబు అనే వ్యక్తి ఏపీ02 ఆర్ 8118 నంబరు గల సిల్వర్ రంగు ఇన్నోవా కారు కొనుగోలు చేశాడు. మరో ప్రాంతంలో బిస్కట్ రంగు ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే రెండింటికీ ఒకే నంబరు ప్లేటు తలిగించుకుని దర్జాగా బాడుగకు తిప్పుతున్నాడు. పన్నులు ఎగ్గొట్టడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లను ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను వ్యక్తిగత విద్యుత్ వాహనాలకు, పసుపు రంగు అక్షరాలతో కూడిన ప్లేట్లను ట్యాక్సీలకు కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ట్యాక్సీ వినియోగదారులకు సమానంగా ఈ–వాహనాల వినియోగాన్ని పెంచేలా 16–18 మధ్య వయసున్న వారు కూడా విద్యుత్ స్కూటర్లు నడిపేందుకు అనుమతినిచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ప్లేట్లున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పార్కింగ్‌లోనూ ప్రాధాన్యత ఉండటంతోపాటు రద్దీ ప్రాంతాల్లోనూ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. టోల్గేట్ పన్నులో కూడా రాయితీ లభిస్తుంది. -
ఈ బండి ఎవరిదో..?
♦ నంబర్ ప్లేట్లు లేకుండానే తిరుగున్న ద్విచక్రవాహనాలు ♦ ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన 8 వేల హై సెక్యూరిటీ ప్లేట్లు ♦ టీఆర్ నంబర్ సైతం కేటాయించని షోరూంలు ♦ ప్రమాదాల సమయంలో గుర్తించడంలో ఇబ్బందులు ♦ పట్టించుకోని పోలీస్, రవాణా శాఖాధికారులు మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ద్విచక్రవాహనాలు ఎలాంటి నంబరు ప్లేటు లేకుండా రోడ్లపై రయ్.. రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. పలు బైక్ షోరూం నిర్వాహకులు సైతం వాహనాలు షోరూం నుంచి డెలివరీ చేసే సమయంలో వాహనాలకు ఇచ్చే సమయంలో తాత్కాలిక (టీఆర్) నంబర్ కేటాయించకుండా స్టిక్కర్ అతికించి చేతులు దులుపుకొంటున్నారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో ప్రమాదాల జరిగిన సమయంలో నిందితులను గుర్తించడానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రమాదాలు జరిపిన వారు ఎక్కడున్నా తెలిసేలా ‘హై సెక్యూరిటీ’ నంబర్ పేట్లను తయారు చేయించి వాహనదారులకు అప్పగిస్తోంది. అయితే వాహనదారులు కొత్త వాహనం కొనగానే రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు వాహనాన్ని బట్టి నిర్ణయించిన ధర చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్‌ను ఆ రోజు సాయంత్రమే రవాణా శాఖ కేటాయిస్తుంది. రెండు రోజుల్లో నంబర్ ప్లేట్ పూర్తయి బిగించుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అయితే వాహనదారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్లేట్ అన్ని బిగింపు కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. పోలీసులు, రవాణా శాఖాధికారులు కూడా తనిఖీలు చేయకపోవడంతో వాహనదారులు నంబరు ప్లేట్ల బిగింపునకు ఆసక్తి చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో.. గతంలో వాహనదారులు దొంగ నంబర్ ప్లేట్లు వాడుతుండడంతో పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడం చాలా ఇబ్బందులుండేవి. ఇబ్బందులు ఉండకుండా తప్పు చేసిన వారు ఎక్కడున్నా తెలిసేలా సీసీ కెమెరాలో నమోదయ్యేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాహనదారులు ఇష్టారీతిన వాడకుండా నిబంధనల ప్రకారం తయారు చేసిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమలు చేసింది. అయితే రెండు మూడేళ్లుగా రవాణా శాఖలో ఎనిమిది వేలకు పైగా నంబర్ ప్లేట్లు వాహనదారులకు బిగించుకోకపోవడంతో మూలనపడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా అధికారుల ముందు తిరిగినా చర్యలు శూన్యం. ఏవైనా ప్రమాదాలు, దోపిడీలు జరిగినప్పుడు నిందితులను ఎలా పట్టుకుంటారో అధికారులకే తెలియాలి మరి. నెల రోజుల గడువిస్తాం.. చాలా వరకు వాహనదారులు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్లు బిగించుకోకుండా వెళ్తున్నారు. దీని ద్వారా నెంబర్ ప్లేట్ బిగింపు సెంటర్లో చాలా వరకు మిగిలిపోతున్నాయి. అలాంటి వారికి ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు గడువు కేటాయిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన వాహనదారులకు ఉచితంగా ప్లేట్లు బిగిస్తాం. రాకపోతే జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని ప్రతి వాహనంపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేస్తాం. – మమత ప్రసాద్, డీటీసీ, మహబూబ్‌నగర్ -
ఎస్ఎస్ఏలో అద్దెకార్ల మాయ!
→ నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డ్ వాహనాలు → అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు → సొంతకార్లలో అద్దె దర్జా అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న కారు ఎస్ఎస్ఏ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ ఇంజనీర్ది. ఆయన తన కారునే అద్దె వాహనంగా చూపించి ప్రతి నెలా రూ.24 వేలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు తీసుకునే వాహనం కచ్చితంగా ఎల్లో బోర్డు (ట్యాక్సీప్లేట్) అయి ఉండాలి. కానీ ఈ అధికారి వైట్ బోర్డు (ఓన్ప్లేట్) వాహనంలో దర్జాగా తిరుగుతున్నారు. పదిలో నాలుగు వైట్ బోర్డు వాహనాలు సర్వశిక్ష అభియాన్‌లో మొత్తం పది వాహనాలు ఉన్నాయి. పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లు, డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఎస్ఎస్ఏ నిధుల నుంచి వాహనం ఏర్పాటు చేశారు. వీటిలో పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లకు మాత్రం ఎల్లో బోర్డు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి ఏర్పాటు చేసిన కారు కూడా వైట్ బోర్డు కల్గినవే ఉన్నాయిl. వైట్ బోర్డు వాహనాలను అద్దెకు వినియోగించకూడదనే నిబంధన ఈ అధికారులకు అందరికీ తెలిసినా అడిగే వారు లేక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇలా ట్యాక్సీ ప్లేట్ స్థానంలో సొంతకార్లు వాడుతున్న వారిలో కొందరు తామే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోగా, మరికొందరు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరిట వాహనాలు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వాహనాలకు నెలనెలా చెల్లించాల్సిన కొనుగోలు కంతు ఈ అద్దెలో సరి చేస్తున్నారు. కిలోమీటర్లు మించి తిరిగితే ఒట్టు నెలకు రూ. 24 వేలు ప్రభుత్వం వాహనానికి అద్దె చెల్లిస్తుంది. సదరు వాహనం నెలలో 2,500 కిలోమీటర్లు తిరగాలి. అయితే ఎల్లో బోర్డు వాహనాలు మాత్రం కిలోమీటర్లు పూర్తిగా తిరుగుతున్నా...వైట్ బోర్డు వాహనాలు ఆ మేర తిరగడం లేదు. పైగా సొంత కార్లపై ఉన్న మమకారంతో వాటిని ఎక్కువగా తిప్పేందుకు ఇష్టపడడం లేదని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎల్లో బోర్డు కల్గిన వాహనాలను సెక్టోరియల్ ఆఫీసర్లు అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాహనాలను క్యాంపులకు తీసుకెళ్తుంటారు. అయితే వైట్ బోర్డు కల్గిన వాహనాలు కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్నా, వాటిని పంపడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వైట్‌బోర్డు కల్గిన వాహనాలన్నీ అధికారులవే కావడంతో సిబ్బంది వాటిని అడిగే సాహసం కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎల్లో బోర్డు కల్గిన వాహనాలు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు రూ. 18–23 వేలు దాకా ఖర్చవుతుంది. వైట్‌బోర్డు వాహనాలకు ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రూ. 6–10 వేలు మాత్రమే. అంటే వైట్‌బోర్డు కల్గిన వాహనాలను వినియోగిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే... ఎస్ఎస్ఏలో ప్రతినెలా వాహనాలకు సంబంధించినlఅద్దె బిల్లులను పరిశీలించే బాధ్యతను వైట్‌బోర్డు వాహనాన్ని వినియోగిస్తున్న డీఈకే అప్పగించడం. -
ఆన్లైన్లోనే వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ మార్పు
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నెంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కానీ విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ ఇప్పటిదాకా మొదలు కాలేదు. ఈ నెలాఖరుకుగాని, మే మొదటి వారంలోగాని ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 74 లక్షల వాహనాలు ప్రస్తుతం ఏపీ సీరీస్‌తో కొనసాగుతున్నాయి. వాటన్నింటిని టీఎస్ సిరీస్‌లోకి మార్చాల్సి ఉంది. సర్వీసు ఛార్జి, ఆర్సీ బుక్కు ఖర్చు భరించాల్సిందే.. స్టేట్ కోడ్‌తోపాటు జిల్లా కోడ్ కూడా మారుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కూడా కొత్త కోడ్లను కేటాయించింది. రిజిస్ట్రేషన్ నంబరు మాత్రం పాతదే కొనసాగనుండగా స్టేట్, జిల్లా సిరీస్‌లు మారతాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 74 లక్షల వరకు వాహనాల నంబర్ సిరీస్ మార్చాల్సి ఉన్నందున వాహనదారులు నేరుగా ఆన్లైన్లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబరు సిరీస్‌కు సంబంధించి ఆర్సీ కార్డు ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడికి ఖర్చు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ.100 వరకు సర్వీసు ఛార్జీ భరించాల్సి ఉంటుంది. కొత్త ఆర్సీ కార్డు తయారీకి అయ్యే వ్యయాన్ని కూడా వాహనదారులే భరించాలి. అదికాకుండా కచ్చితంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే. గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఖర్చు భరించాల్సి వస్తుంది. వెరసి ద్విచక్రవాహనదారులకు రూ.450 వరకు, కార్లకు అది మరో రూ.200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని సమాచారం. -
'నాలుగు నెలల్లో నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి'
-
'నాలుగు నెలల్లో నంబర్ ప్లేట్లు మార్చుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్ల మార్పునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లోగా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. నాలుగు అంకెల నంబర్ యథావిథిగా ఉంటూనే నంబర్ ప్లేట్ మారనుంది. ఏపీ స్థానంలో టీఎస్‌తోపాటు జిల్లా కోడ్లు మారనున్నాయి. ఆన్ లైన్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మార్చుకునే సదుపాయం ఉంటుంది. ఈ మేరకు గురువారం తెలంగాణ రవాణాశాఖగురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాయం
హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ పేట్లు మాయమయ్యాయి. ఈ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. కాగా వారు నంబర్ ప్లేట్లను ఆర్టీఏ ఆఫీసులో డెలివరీ ఇచ్చారు. అయితే మంగళవారం ఆఫీసులో నంబర్ ప్లేట్ల బ్యాగు మాయమైంది. దీనిలో సుమారు 300 నంబర్ ప్లేట్లు ఉన్నాయి. దీంతో ఆఫీసు సిబ్బంది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. -
లక్కీ నంబర్
-
లక్కీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టొచ్చా?
-
లక్కీ....లక్కీ....లక్కీ నెంబర్స్
-
టీఎస్‌గా మార్పునకు రెడీ
రెండుమూడు రోజుల్లో స్పష్టత హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏపీ సిరీస్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు విషయంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నంబరు మార్పుతోపాటు కొత్త ఆర్సీ కార్డును ఒకేసారి అదే సమయంలో తీసుకోవాల్సిన అవసరం లేకుండా వారికి వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా తెలంగాణలోని ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసి.. ఆ వివరాల ప్రతులను వాహనదారులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అలా పొందిన పత్రానికి నిర్ధారిత చెల్లుబాటు గడువు ఇస్తారు. ఆలోపు కొత్త నంబరుతో ఉన్న రిజిస్ట్రేషన్ కార్డును పొందాల్సి ఉంటుంది. అయితే ఎక్కడపడితే అక్కడ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలా? లేక ఈ-సేవ, స్థానిక ఆర్టీఏ కార్యాలయం ద్వారా మాత్రమే పొందే ఏర్పాటు చేయాలా అన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ తాత్కాలిక పత్రాన్ని పొందేందుకు మాత్రం ప్రత్యేక రుసుము ఉండదని అధికారులంటున్నారు. కొత్త నంబరుతో ఉన్న ఆర్సీ కార్డుకు మాత్రం నిర్ధారిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అది ద్విచక్రవాహనాలకు, ఇతర వాహనాలకు వేరువేరుగా ఉంటుంది. ప్రభుత్వ పరిశీలనకు అభ్యంతరాలు... తెలంగాణకు టీఎస్ సిరీస్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలను కూడా కొత్త సిరీస్‌లోకి మార్చే విషయంలో ప్రజల నుంచి నామమాత్రంగా అభ్యంతరాలు వచ్చాయి. కొన్ని సంస్థలతోపాటు వ్యక్తుల నుంచి దాదాపు 35 అభ్యంతరాలు అధికారులకు అందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వనుంది. -
తగ్గిన ‘హైసెక్యూరిటీ’..
వాహనాలకు అమర్చే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు డిమాండ్ బాగా తగ్గింది. ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్లు అమర్చుకోవాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గిరాకీ బాగానే ఉంది. అప్పట్లో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 90 శాతం మంది ఈ నంబర్ ప్లేట్లను తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాత నంబర్లు ఉంటాయా..?రిజిస్ట్రేషన్ మారుతుందా..? లేదా అనేది తెలియక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త రాష్ట్రంలో తీసుకున్న నంబర్లుతో సరిపెట్టుకుందామని... హైసెక్యూరిటీ నంబర్లు వైపు ఎవరూ వె ళ్లడంలేదు. గత నెల 18 తేదీ నుంచి ఆర్టీఏ అధికారులు కొత్త నంబర్లు కేటాయిస్తున్నా వాటిలో 30 శాతం మంది మాత్రమే హైసెక్యూరిటీ నంబర్లు బుక్ చేసుకుంటున్నారు. గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మంది వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా అందులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను కేవలం 15 వందల మంది మాత్రమే బుక్ చేసుకున్నారు. ఒకే కౌంటర్‌తో ఇబ్బందులు.. ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో లెర్నింగ్ లెసైన్స్ కోసం వచ్చే వారికి ఒకే కౌంటర్ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేలి ముద్ర తప్పనిసరని ప్రభుత్వం నిర్ణయించడంతో ఒకే కౌంటర్లో గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
‘ప్లేట్’ ఫిరాయింపునకు చెక్!
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:వాహనాల నంబర్ ప్లేట్లను మార్చేసి దోపిడీలు, అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైసెక్యూరిటీ ప్లేట్ల విధానాన్ని జిల్లాలో కూడా త్వరలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సంగారెడ్డి ల్లో అమలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ కమిషనర్ నుంచి అధికారులకు శనివారం ఆదేశాలు అందాయి. రెండు నెల ల్లో హైసెక్యూరిటీ ప్లేట్ల విధానం అమల్లోకి రావాలని ఆదేశించారు. ఏ వాహనానికి ఎంత ఫీజు తీసుకోవాలన్న వివరాలు కూడా వచ్చాయి. దీంతో జిల్లాపై రూ.6 కోట్లపైనే భారం పడనుంది. వాహనాల వివరాలు జిల్లాలో లక్షా 30 వేల వరకూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు 70 వేలు, కార్లు వెయ్యి, జీపులు రెండు వేలు, లారీలు ఐదు వేలు, ట్రాక్టర్లు నాలుగు వేలు, ఇతర వాహనాలు 10 వేలు వర కు ఉన్నాయి. వీటన్నింటికీ హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలుత నూతన వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చుతారు. పాత వాహనాలకూ తప్పదు.. పాతవాహనాలకు కూడా ఈ ప్లేట్లు తప్పని సరిగా అమర్చాలి. 2015 డిసెంబర్ కల్లా పాత వాహనాలకు ప్లేట్లును పూర్తిస్థాయిలో అమర్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. లాభాలు: హైసెక్యూరిటీ ప్లేట్లలో ఓ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. దీంట్లో వాహనం పూర్తి వివరాలు పొందుపరుస్తారు. దీంతో వాహనాలను దొంగిలించినా విక్రయించడానికి కుదరదు. వాహనాల దొంగతనాలకు, నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలను అక్రమ రవాణాకు ఉపయోగించిన తరవాత దహనం చేయడానికి వీలుండదు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం పూర్తిగా కాలిపోతే, కాలిపోడానికి ఆస్కారం లేని చిప్ ద్వారా వివరాలను సేకరించవచ్చు. రెండు కౌంటర్లు.. హైసెక్యూరిటీ ప్లేట్ల జారీ కోసం విజయనగరం పట్టణంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రవాణశాఖ కార్యాలయం వద్ద ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్సులో మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు పనిచేస్తాయి. ఒక సారి అమర్చితే....అంతే వాహనాలకు హైక్యూరిటీ ప్లేట్లను ఒక సారి అమర్చితే వాటిని మార్చడానికి, సరిచేయడానికి వీలుండదు. లేజర్కోడ్లో వాహనాల నంబర్, యజమాని ఫోటో, ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి ఉంటాయి. వీటిని ఆన్లైన్ ద్వారా ఎక్కడైనా చూడవచ్చు.హైసెక్యూరిటీ ప్లేట్ల ధరలు అధికంగా ఉన్నాయని, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ధరలను తగ్గించలేదు. ధరల వివరాలు వాహనం ధర టూవీలర్ రూ.245 త్రీవీలర్ రూ.282 కారు రూ.619 ట్రాక్టర్ట్రైలర్,లారీలు, రూ.619 -
హైరానా
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :వాహనాలకు విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాలన్న సర్కారు నిర్ణయం గుబులు రేపుతోంది. ఆ తరహా నంబర్ ప్లేట్లను ఉపయోగించాలని సుప్రీం కోర్టు ఏనాడో ఆదేశించింది. ఎట్టకేలకు ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్లనుఅమర్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచే అమలు చేయాలని రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలకూ 2015 డిసెంబర్‌లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిని అమర్చుకోవాలంటే జిల్లాలోని వాహనాల యజమానులు సుమారు రూ.13 కోట్లను ఖర్చు చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. మరోవైపు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారనే వివాదం చెలరేగుతోంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాలు జారీ కాకపోవడంతో జిల్లా రవాణా శాఖ అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. పాత విధానంలో లొసుగులెన్నో... పాత విధానంలో నంబర్ ప్లేట్లు వినియోగించే విషయంలో లోపాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వాహనాలకు తెలుపురంగు ప్లేట్లపై నలుపు రంగుతో నంబర్లు వేయూల్సి ఉంది. ప్రైవేటు వాహనాలకు పసుపు రంగు ప్లేటుపై నలుపు రంగుతో నంబర్లు వేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించి నంబర్ప్లేట్ల వినియోగంలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. ప్లేట్లపై సినీ హీరోలు, వ్యక్తిగత చిత్రాలు ముద్రిస్తున్నారు. నంబర్లను ఆంగ్ల అక్షరాల్లో వేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. సున్నాతో మొదలయ్యే నంబర్లో సున్నాను వాడటం లేదు. ఈ పరిస్థితి వల్లప్రమాదాలు, అసాం ఘిక ఘటనలు జరిగితే వాహన యజమానుల గుర్తింపు కష్టతరంగా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వినియోగించాలని నిర్ణయించారు. కొత్త బాదుడు కొత్త నంబర్ ప్లేట్ల ఏర్పాటు చేసుకోవాల్సి రావడం వల్ల వాహన యజమానులకు చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి. దీనివల్ల జిల్లాలోని వాహన యజమానులపై సుమారు రూ.13 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉండగా, ఈ మొత్తంలో ద్విచక్ర వాహన యజమానులే సింహభాగం. జిల్లాలో 4 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చాలంటే రూ.9.36 కోట్ల మేర భారం పడుతుంది. ఆటోల వంటి మూడు చక్రా వాహనాలు 50వేలకు పైగా ఉన్నాయి. వాటి యజమానులు రూ.1.19 కోట్లు, కారు వంటి లైట్ మోటార్ వాహనాలు 24వేలు ఉండగా, వాటిపై రూ.1.26 కోట్ల మేర భారం పడనుంది. వాణిజ్య, భారీ, ట్రాలర్ వాహనాలు 23 వేల వరకూ ఉన్నాయి. వీటిపై సుమారు రూ.1.26 కోట్ల మేర భారం పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త విధానంలో ఒక మిల్లీమీటర్ మందం గల హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను వాహనానికి ముందు, వెనుక అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనిని అల్యూమినియంతో తయారు చేస్తారు. దీనిపై నీలి రంగులో హాలోగ్రామ్ ముద్రించి ఉంటుంది. ప్రతి ప్లేటుపై ఏడు అంకెలతో కూడిన లేజర్ కోడ్‌తోపాటు, తొలగించేందుకు వీలులేనివిధంగా స్నాప్ లాక్ ఉంటుంది. నంబర్‌ను మార్చేందుకు, ఇతర నంబర్ వేసేందుకు, పగులగొట్టేందుకు వీలుండదు. రవాణా శాఖ కార్యాలయంలోనే దీనిని అమర్చేలా చర్యలు తీసుకుంటారు.