సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకు అమర్చే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై ఇష్టారీతిన ఫ్యాన్సీ లెటర్లు, ఇతర గుర్తులు వాడరాదని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ నంబర్ ప్లేట్ల తయారీదారులను హెచ్చరించారు. సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989 ప్రకారం నంబర్ ప్లేట్లు రూపొందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాంపల్లిలోని ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో వాహనాలకు రిజిస్ట్రేషన్ నం బర్ ప్లేట్లు తయారీదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంబర్ ప్లేట్ తయారీదారులు తమ వద్దకు వచ్చే కస్టమర్ ఒరిజినల్ ఆర్‌సీ, యజ మాన్య వివరాలు తీసుకోవడంతో పాటు సెంట్రల్ మోటారు వెహికల్ నిబంధనలు–1989పై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఒక సర్క్యు లర్ జారీ చేశారు. సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ– 1 ఎల్‌ఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment