సాధారణ వెహికల్ నెంబర్ ప్లేట్స్ కంటే కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ సొంతం చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వీఐపీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఫీజును భారీగా పెంచింది. ఎంచుకునే నెంబర్ సిరీస్‌లను బట్టి వీటి ధరలు రూ. 18 లక్షల వరకు ఉండవచ్చు. 2013 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీఐపీ నంబర్ ప్లేట్ ధరను పెంచడం ఇదే తొలిసారి.
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్‌లలో ఒకటైన '0001' కోసం ఎదురు చూసే కస్టమర్‌లు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫోర్ వీలర్ కోసం ఈ నెంబర్ కొనుగోలు చేయాలంటే రూ. 6 లక్షలు, టూ వీలర్ లేదా త్రీ వీలర్ కోసమయితే రూ. 1 లక్ష అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కూడా నగరాన్ని బట్టి ఉంటాయి. ఈ జాబితాలో ముంబై, ముంబై సబర్బన్, పూణే, థానే, రాయగడ, ఔరంగాబాద్, నాసిక్, కొల్హాపూర్, నాసిక్ ఉన్నాయి.
ధరల పెరుగుదలకు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్ ధర రూ. 12 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు రూ. 6 లక్షలు పెరగడంతో ఇది రూ. 18 లక్షలకు చేరింది. ఈ నెంబర్ కొనుగోలు చేసిన తరువాత జీవిత భావస్వామికి, కొడుకు, కూతుళ్ళకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.
మహర్షత్రలో వీఐపీ నెంబర్ ప్లేట్‌లతో 240 వాహనాలు ఉన్నాయి. ఇందులో చాలావరకు '0009', '0099', '0999', '9999', '0786' మొదలైన సిరీస్ నెంబర్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా ఈ వీఐపీ నెంబర్ ప్లేట్ ఫీజుల విధానంలో మార్పు చేయడం జరిగింది.
వీఐపీ నెంబర్ ప్లేట్లకు ఎందుకు డిమాండ్
నెంబర్ ప్లేట్ అనేది.. వాహన రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. అయితే కొందరు సెంటిమెంట్ లేదా స్టేటస్ తెలియజేసుకోవడానికి వీఐపీ నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తుంటారు. వీఐపీ నెంబర్ ప్లేట్స్ ధరలు మన దేశంతో పోలిస్తే.. దుబాయ్‌లో చాలా ఎక్కువ.
ప్రపంచంలో ఖరీదైన నెంబర్ ప్లేట్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ 'పీ7'. ఇది దుబాయ్ దేశానికీ చెందిన నెంబర్ ప్లేట్. దీని ధర 15 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 125 కోట్లు కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే నెంబర్ ప్లేట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?
మన దేశంలో కూడా కూడా వీఐపీ నెంబర్ ప్లేట్స్ కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ తన లంబోర్ఘిని కారు నెంబర్ కోసం రూ. 17 లక్షలు కాచు చేశారు. మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి తన గ్యారేజిలోని అన్ని కార్లకు 369 అనే నెంబర్ ఎంచుకుంటారు. దీనికోసం కూడా అయన ఎక్కువ ఖర్చు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment