
ఈ ప్రశ్నను దేశ ప్రజలంతా అడగాలి
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచన
అక్రమ వలసదార్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ఆందోళన
ఛత్రపతి శంభాజీ నగర్: దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదార్లు జోక్యం చేసుకుంటున్నారని, నిర్ణయాత్మక శక్తులుగా మారుతున్నారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా నుంచి అక్రమ వలసదార్లను అక్కడి ప్రభుత్వం బలవంతంగా బయటకు పంపిస్తోందని పరోక్షంగా ప్రస్తావించారు.
మన దేశంలో అలాంటి ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. శనివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడా యూనివర్సిటీ 65వ స్నాతకోత్సవంలో జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. అక్రమ వలసదార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మన దేశంలో నివసించే హక్కు లేని కోట్లాది మంది ఇక్కడే చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. ఇక్కడే బతుకుతున్నారు.
మన వనరులపై కన్నేశారు. వాటి కోసం డిమాండ్ చేస్తున్నారు. మన విద్య, ఆరోగ్యం, గృహం.. ఇలా అన్నింటిపైనా వారి దృష్టి పడింది. వారు మరింత ముందుకెళ్తున్నారు. మన ఎన్నికల ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుంటున్నారు. అక్రమ వలసదార్ల సమస్యపై అందరికీ అవగాహన కలి్పంచాలి. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని పేర్కొన్నారు. జాతీయవాదమే మన మతమని ఉద్ఘాటించారు.
జాతీయవాదానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో బలవంతపు మత మారి్పళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధన్‌ఖడ్ ఆరోపించారు. నచి్చన మతాన్ని స్వీకరించే హక్కు పౌరులందరికీ ఉందని చెప్పారు. అయితే, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి మతం మార్చడం దారుణమని విమర్శించారు. మత మారి్పళ్ల ద్వారా భారతదేశ జనాభా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి, దేశంపై ఆధిపత్యం చెలాయించడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కొన్ని దేశాల్లో మతమారి్పళ్ల వల్ల మెజార్టీ సమూహాలు మైనారీ్టలుగా మారిపోయాయని గుర్తుచేశారు. దేశం అభివృద్ధి చెందాంటే సామాజిక సామరస్యం అవసరమని ఉద్ఘాటించారు.
రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి
మన రాజ్యాంగాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలని జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్యాంగం మనకు ఎంతగా అర్థమైతే మనం జాతీయవాదం వైపు అంతగా మొగ్గుచూపుతామని తెలిపారు. మనకు జాతీయవాదమే అతిపెద్దగా మతంగా భావించాలన్నారు. కొందరు దుషు్టలు విదేశాల నుంచి వస్తున్న నిధులతో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.