ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు | No Impact New FASTag Rules on Highway Says NHAI | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు

Published Fri, Feb 21 2025 10:52 AM | Last Updated on Fri, Feb 21 2025 11:37 AM

No Impact New FASTag Rules on Highway Says NHAI

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 70 నిమిషాల ఫాస్ట్‌ట్యాగ్ రూల్స్.. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త రూల్స్ ఎక్కడ వర్తిస్తాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్‌ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు.

ఫాస్ట్‌ట్యాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్‌ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్‌ట్యాగ్‌ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే కోడ్‌ 176 ఎర్రర్‌ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఇక బ్లాక్‌లిస్ట్‌ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ''కొత్త ఫాస్ట్‌ట్యాగ్ రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయి''.

FASTag అంటే ఏమిటి?
దేశంలోని అన్ని రహదారులపై టోల్ కలెక్షన్ పాయింట్ల ద్వారా వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో 2019 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాగ్ - ఫాస్ట్‌ట్యాగ్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా టోల్ ప్లాజాల ద్వారా రోడ్డు ప్రయాణ వేగాన్ని వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ వచ్చిన తరువాత వసూళ్లు కూడా భారీగా పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement