వాహనాలకు అమర్చే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు డిమాండ్ బాగా తగ్గింది. ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్లు
అమర్చుకోవాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గిరాకీ బాగానే ఉంది. అప్పట్లో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 90 శాతం మంది ఈ నంబర్ ప్లేట్లను తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాత నంబర్లు ఉంటాయా..?రిజిస్ట్రేషన్ మారుతుందా..? లేదా అనేది తెలియక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.
కొత్త రాష్ట్రంలో తీసుకున్న నంబర్లుతో సరిపెట్టుకుందామని... హైసెక్యూరిటీ నంబర్లు వైపు ఎవరూ వె ళ్లడంలేదు. గత నెల 18 తేదీ నుంచి ఆర్టీఏ అధికారులు కొత్త నంబర్లు కేటాయిస్తున్నా వాటిలో 30 శాతం మంది మాత్రమే హైసెక్యూరిటీ నంబర్లు బుక్ చేసుకుంటున్నారు. గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మంది వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా అందులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను కేవలం 15 వందల మంది మాత్రమే బుక్ చేసుకున్నారు.
ఒకే కౌంటర్‌తో ఇబ్బందులు..
ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో లెర్నింగ్ లెసైన్స్ కోసం వచ్చే వారికి ఒకే కౌంటర్ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేలి ముద్ర తప్పనిసరని ప్రభుత్వం నిర్ణయించడంతో ఒకే కౌంటర్‌లో గంటల తరబడి లైన్‌లో నిల్చుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
తగ్గిన ‘హైసెక్యూరిటీ’..
Published Mon, Jul 7 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement