అతడో ధనవంతుడు.. పైగా ఓ పెద్ద కంపెనీని యజమాని.. కార్లంటే ఎంతో ఇష్టం.. నచ్చిన కారు నంబర్‌ప్లేట్ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం.. అయనే భారత మూలాలున్న దుబాయిలో నివసిస్తున్న అబుసల్హా(బల్విందర్‌సింగ్ సాహ్నీ). ఆయనకు నచ్చిన కారు నంబర్‌ప్లేట్‌కు ఏకంగా రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కార్లపై తనకున్న ఆసక్తి ఎలాంటిదో ఈ కథనంలో తెలుసుకుందాం.
దుబాయిలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న బల్విందర్‌సింగ్ సాహ్నీ(అబుసల్హా) రాజ్ సాహ్ని గ్రూప్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బల్విందర్‌సింగ్ సాహ్నీకి కార్లంటే చాలా ఇష్టం. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఖరీదైన కార్లలోని కల్లినన్స్, ఫాంటమ్ VIII సెడాన్ వంటి మోడళ్లు సాహ్నీ గ్యారేజ్‌లో ఉన్నాయి. అతడి వద్ద ఎన్నో అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ కార్లు ఉన్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కార్లతో పాటు తనకు నచ్చిన నంబర్‌ప్లేట్‌లను ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేయడం తనకు అలవాటని తెలిపారు. అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్లు తనవద్ద ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని కార్ల వాస్తవ ధరకంటే ఎన్నోరెట్లు ఎక్కువ.
ఇదీ చదవండి: రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
సాహ్నీ వద్ద రూ.6 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాటికి సింగిల్ డిజిట్(1), కొన్నింటికి డబుల్ డిజిట్ నంబర్‌ప్లేట్ తీసుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఒక్కోకారుకు దాదాపు రూ. రూ.60 కోట్లు నుంచి రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాహ్నీ సుమారు రూ.10 కోట్లు వెచ్చించి రోల్స్‌రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు ఏకంగా సుమారు రూ.141 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ నంబర్‌ప్లేట్‌పై ‘DUBAI D 5’ అని ఉంటుంది. తన వద్ద సింగిల్ డిజిట్ నంబర్‌తో మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కూడా ఉన్నట్లు చెప్పారు. బెంట్లీ రూపొందించిన ఖరీదైన కస్టమ్ ఫర్నిచర్ సైతం తన ఇంట్లో ఉందని సాహ్నీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment