Luxury car makers
-
నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే..
అతడో ధనవంతుడు.. పైగా ఓ పెద్ద కంపెనీని యజమాని.. కార్లంటే ఎంతో ఇష్టం.. నచ్చిన కారు నంబర్‌ప్లేట్ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం.. అయనే భారత మూలాలున్న దుబాయిలో నివసిస్తున్న అబుసల్హా(బల్విందర్‌సింగ్ సాహ్నీ). ఆయనకు నచ్చిన కారు నంబర్‌ప్లేట్‌కు ఏకంగా రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కార్లపై తనకున్న ఆసక్తి ఎలాంటిదో ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయిలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న బల్విందర్‌సింగ్ సాహ్నీ(అబుసల్హా) రాజ్ సాహ్ని గ్రూప్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బల్విందర్‌సింగ్ సాహ్నీకి కార్లంటే చాలా ఇష్టం. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఖరీదైన కార్లలోని కల్లినన్స్, ఫాంటమ్ VIII సెడాన్ వంటి మోడళ్లు సాహ్నీ గ్యారేజ్‌లో ఉన్నాయి. అతడి వద్ద ఎన్నో అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ కార్లు ఉన్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కార్లతో పాటు తనకు నచ్చిన నంబర్ప్లేట్లను ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేయడం తనకు అలవాటని తెలిపారు. అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్లు తనవద్ద ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని కార్ల వాస్తవ ధరకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్ సాహ్నీ వద్ద రూ.6 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాటికి సింగిల్ డిజిట్(1), కొన్నింటికి డబుల్ డిజిట్ నంబర్‌ప్లేట్ తీసుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఒక్కోకారుకు దాదాపు రూ. రూ.60 కోట్లు నుంచి రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాహ్నీ సుమారు రూ.10 కోట్లు వెచ్చించి రోల్స్‌రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు ఏకంగా సుమారు రూ.141 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ నంబర్‌ప్లేట్‌పై ‘DUBAI D 5’ అని ఉంటుంది. తన వద్ద సింగిల్ డిజిట్ నంబర్‌తో మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కూడా ఉన్నట్లు చెప్పారు. బెంట్లీ రూపొందించిన ఖరీదైన కస్టమ్ ఫర్నిచర్ సైతం తన ఇంట్లో ఉందని సాహ్నీ అన్నారు. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ సీ40 రీచార్జ్ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈవీలదే కీలక పాత్ర.. వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది. Here’s a look at the born electric SUV, Volvo C40 Recharge. India Spec: ⚡️408hp & 660Nm ⚡️Range: upto 530 WLTP ⚡️Twin motors with AWD ⚡️0-100 kmph: 4.7 sec ⚡️150kW DC: 10-80% in 27 min ⚡️Rear boot: 413 litres ⚡️Frunk: 30 litres#volvo #volvoev #volvoindia #c40recharge #ev pic.twitter.com/PcyeVfvUlw — Express Drives (@ExpressDrives) June 14, 2023 -
తొమ్మిది నెలల్లో 2,947 కార్లు: ఆడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 2,947 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి. ఏ8, క్యూ7 మోడళ్లు ఈ వృద్ధిని నడిపించాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ–ట్రాన్ శ్రేణి, ఏ4, ఏ6, క్యూ5, ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ శ్రేణి మోడళ్లకు సైతం డిమాండ్ ఉందని వెల్లడించింది. ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారం అయిన ఆడి అప్రూవ్డ్ ప్లస్ 73 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. సెమీకండక్టర్ల కొరతతోపాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ బలమైన వృద్ధి సాధించడం బ్రాండ్, విస్తృత ఉత్పత్తులపట్ల కస్టమర్ల ఉత్సాహాన్ని పునరుద్ఘాటిస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. స్థిర డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత పండుగల సీజన్లో మెరుగైన వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆడి అప్రూవ్డ్ ప్లస్ కేంద్రాలు ప్రస్తుతం 18 ఉన్నాయి. డిసెంబర్ నాటికి మరో నాలుగు జోడించనున్నారు. -
లగ్జరీ కార్... టాప్‌గేర్!
న్యూఢిల్లీ: మందగమనంతో వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కోట్ల ఖరీదు చేసే సూపర్ లగ్జరీ కార్ల జోరు మాత్రం తగ్గలేదు. పెపైచ్చు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మరిన్ని కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడానికి ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఆర్థిక సర్వీసుల సంస్థ సీఎల్ఎస్ఏ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 2015 నాటికి రెట్టింపై 4,03,000కి పెరుగుతుందని అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా కన్నా కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత సంపన్నులు భారత్‌లోనే ఉండనున్నారు. ఇలాంటి గణాంకాలతో అత్యంత ఖరీదైన కార్ల కంపెనీలు భారత్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటిదాకా ఏటా రెండో, మూడో సూపర్ లగ్జరీ కార్ల కొత్త మోడల్స్ భారత్‌లో ఆవిష్కరించేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఏకంగా ఆరు మోడల్స్‌ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్‌కారు బ్రాండ్ లంబోర్గిని, బ్రిటిష్‌కి చెందిన బెంట్లీ.. ఆస్టన్ మార్టిన్, నెదర్లాండ్స్ కంపెనీ స్పైకర్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్, గలార్డో ఎల్పీ550-2 లిమిటెడ్ ఎడిషన్లను, రోల్స్ రాయిస్ రెయిత్లను ప్రవేశపెట్టాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల పైమాటే. రూ.37 కోట్ల దాకా రేట్లు.. సాధారణంగా భారత్‌లో లగ్జరీ సెగ్మెంట్ కార్లు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే, జాగ్వార్ అండ్ ల్యాండ్‌రోవర్ వంటి బ్రాండ్లతో మొదలవుతుంటాయి. ఈ కార్ల ధరలు (ప్రీమియం మోడల్స్ మినహా) సుమారు రూ. 1 కోటి లోపే ఉంటున్నాయి. అయితే, కొన్నాళ్లుగా వీటిని మించిన సూపర్ లగ్జరీ బ్రాండ్లకు గిరాకీ పెరుగుతోంది. 20 అడుగుల పొడవు మొదలు రెండు డోర్ల సూపర్ ఫాస్ట్ కార్ల దాకా వీటిలో ఉంటున్నాయి. బుగాటి, కీనిగ్సెగ్, ఫెరారీ, పగాణీ, మాసెరాటి వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్లో ఉంటున్నాయి. మిగతా బ్రాండ్లు వేలల్లో అమ్మితే ఇవి రెండంకెల స్థాయిలో అమ్ముడవుతున్నా కంపెనీలకు ఆదాయం భారీగానే ఉంటోంది. దిగుమతి సుంకాలు పెరగడం, రూపాయి పతనం తదితర కారణాలతో సూపర్ లగ్జరీ కార్ల రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ .. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్, ఇతర రాజకీయ నాయకులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. వీరు కొనే కార్ల ధరలు సుమారు రూ. 1 కోటి నుంచి రూ. 7 కోట్ల దాకా ఉంటున్నాయి. అదే, ఆస్టన్ మార్టిన్ వన్77, బుగాటి వేరాన్ వంటి మోడల్స్ ధరలు ఏకంగా రూ. 20 కోట్లు నుంచి రూ. 37 కోట్ల దాకా ఉన్నాయి. దేశీయంగా ఇవి అత్యంత ఖరీదైనవి. అమ్మకాల్లో 25% దాకా వృద్ధి..: సూపర్ లగ్జరీ కార్లు దేశీయంగా ఏటా 20-25% వృద్ధితో 300-400 మేర అమ్ముడవుతున్నాయని అంచనా. సగటున ఒక్కో కారు ఖరీదు రూ. 3.5 కోట్లు లెక్కగడితే..ఈ మార్కెట్ విలువ రూ. 1,500 కోట్లు. లంబోర్గిని గతేడాది 17 కార్లు విక్రయించింది. ఇప్పుడున్న జోరును బట్టి చూస్తే తాము నిర్దేశించుకున్నట్లుగా 2015 నాటికన్నా ముందుగానే 50 సూపర్ కార్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించేయగలమనేది కంపెనీ వర్గాల ధీమా. ఇక ఆస్టన్ మార్టిన్ గతేడాది 20 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్యను దాటేసింది. ఇదే ఊపులో కొత్తగా తీర్చిదిద్దిన డీబీఎస్ మోడల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆస్టన్ మార్టిన్ కార్ల రేట్లు సగటున రూ. 3 కోట్ల పైనే. వచ్చే నెల బెంట్లీ ఫ్లయింగ్ స్పర్.. బెంట్లీ మోటార్స్ త్వరలో ఫ్లయింగ్ స్పర్ కారును వచ్చే నెల ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 17.3 అడుగుల పొడవుండే ఈ సెడాన్ కారు, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలాసవంతమైన లెదర్ సీట్లు, మినీ రిఫ్రిజిరేటరు మొదలైన హంగులు ఇందులో ఉంటాయి. ఇక సూపర్ స్పోర్ట్స్ కార్లను తయారుచేసే స్పైకర్ కంపెనీ.. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ తమ కారు సీ8 ఐలెరాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఇప్పటికే కొంతమంది డీలర్లను కూడా ఎంపిక చేసుకుంది. దీని ధర రూ. 1 కోటిపైనే ఉండనుంది.