హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సీ40 రీచార్జ్ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది.
కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)
ఈవీలదే కీలక పాత్ర..
వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్ సక్సెస్ జర్నీ)
గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది.
Here’s a look at the born electric SUV, Volvo C40 Recharge.
— Express Drives (@ExpressDrives) June 14, 2023
India Spec:
⚡️408hp & 660Nm
⚡️Range: upto 530 WLTP
⚡️Twin motors with AWD
⚡️0-100 kmph: 4.7 sec
⚡️150kW DC: 10-80% in 27 min
⚡️Rear boot: 413 litres
⚡️Frunk: 30 litres#volvo #volvoev #volvoindia #c40recharge #ev pic.twitter.com/PcyeVfvUlw
Comments
Please login to add a commentAdd a comment