SUV launch
-
మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. దసరాకి డెలివరీలు!
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు లాంచ్ అయింది. అయితే బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్, డెలివరీల కోసం మాత్రం కొంత సమయం వేచిఉండాలి. కాగా ఈ క్రేజీ ఎస్యూవీ గురించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది.మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీల విషయానికొస్తే దసరా నాటికి వినియోగదారులకు వాహనాలను అందజేయడం ప్రారంభిస్తుంది.వేరియంట్లు, ధరలుథార్ రోక్స్ MX1, MX3, MX5, AX3, AX5, AX7 వంటి అనేక రకాల ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ మహీంద్రా కేవలం ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలను మాత్రమే ప్రకటించింది.పెట్రోల్ వేరియంట్లు» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 12.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX3 AT RWD: రూ. 14.99 లక్షలుడీజిల్ వేరియంట్లు» మహీంద్రా థార్ రాక్స్ MX1 MT RWD: రూ. 13.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX3 MT RWD: రూ. 15.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX3L MT RWD: రూ. 16.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ MX5 MT RWD: రూ. 16.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX5L AT RWD: రూ. 18.99 లక్షలు» మహీంద్రా థార్ రాక్స్ AX7L MT RWD: రూ. 18.99 లక్షలుఇంజిన్, గేర్బాక్స్మహీంద్రా థార్ రాక్స్ 2.0L mStallion టర్బో-పెట్రోల్, 2.2L mHawk టర్బో-డీజిల్ అనే రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా 162 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 330 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆటోమేటిక్‌లో అయితే గరిష్ట అవుట్‌పుట్‌లు 177 హెచ్‌పీ, 380 ఎన్ఎం వరకు పెరుగుతాయి. ఆయిల్ బర్నర్ విషయానికి వస్తే ఇది స్టిక్ షిఫ్ట్‌తో 152 హెచ్‌పీ, 330 ఎన్ఎం అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 175 హెచ్‌పీ, 370 ఎన్ఎమ్లను అందుకుంటుంది.కలర్ ఆప్షన్లు, ఫీచర్లుథార్ రాక్స్ మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా, బాటిల్షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పెయింట్ స్కీమ్‌లన్నీ బ్లాక్-పెయింటెడ్ రూఫ్‌తో జత చేయబడి ఉంటాయి. 60:40 రియర్ స్ప్లిట్, 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పవర్డ్ సీట్లు, రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ADAS, అకౌస్టిక్ గ్లాసెస్, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ సీ40 రీచార్జ్ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈవీలదే కీలక పాత్ర.. వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది. Here’s a look at the born electric SUV, Volvo C40 Recharge. India Spec: ⚡️408hp & 660Nm ⚡️Range: upto 530 WLTP ⚡️Twin motors with AWD ⚡️0-100 kmph: 4.7 sec ⚡️150kW DC: 10-80% in 27 min ⚡️Rear boot: 413 litres ⚡️Frunk: 30 litres#volvo #volvoev #volvoindia #c40recharge #ev pic.twitter.com/PcyeVfvUlw — Express Drives (@ExpressDrives) June 14, 2023 -
ఎస్యూవీ లవర్స్ కోసం: సరికొత్తగా న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ టక్సన్ 2022నికొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ ఆగస్ట్ 4 ఇండియాలో లభ్యం కానుంది. కొత్త డిజైన్, పలు సేఫ్టీ ఫీచర్లతో దీన్ని తీసుకురానుంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ తాజాగా ఎస్యూవీ కార్ లవర్స్ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్ బెస్ట్ ఎస్‌యూవీగా ఉన్న ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ టక్సన్: డిజైన్, ఫీచర్లు ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కొత్తగా రూపొందించిన 'పారామెట్రిక్-జువెల్' గ్రిల్‌ను ఫ్రంట్ ఫాసియా , బంపర్‌పై హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌తో పాటు పదునైన కట్‌తో స్పోర్టినెస్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్, లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తుంది. వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇచ్చే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే 10.25అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ ఛార్జర్లాంటి ఫీచర్లున్నాయి. హ్యుందాయ్ టక్సన్: ఇంజీన్ , ధర 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త Nu 2.0 పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త ఆర్ 2.0 డీజిల్ ఇంజన్‌తో లభించనుంది. అంతేకాకుండా, ఇంజిన్లు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. ఎలాంటి కఠినమైన భూభాగంలో నావిగేట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, ఇతర మోడళ్లతో పోటీపడనుంది. The all new @HyundaiIndia #TUCSON premieres in India. #HyundaiTUCSON #NextdriveNow #HyundaiSUVLife @MobilityOutlook pic.twitter.com/T0IaikZVAU — Deepangshu Dev Sarmah (@deepangshu) July 13, 2022 -
కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు
దేశంలో కార్ల వినియోగం రోజోరోజుకు పెరిగిపోతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, టెక్నాలజీతో పాటు రకరకాల మోడళ్లతో వాహన దారుల్ని కనువిందు చేస్తున్నాయి. దీంతో వాహన దారులు సరసమైన ధరల్లో తమకు కావాల్సిన కార్లను సొంతం చేసుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న ఎస్యూవీ వాహనాలు కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతుండగా..ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా మారుతోంది. లగ్జరీ టూ బడ్జెట్ కార్లు సన్ రూఫ్..! లాంగ్ డ్రైవ్‌లో వెదర్‌ను ఎంజాయ్ చేసేందుకు వెస్ట్రన్ కంట్రీస్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ కార్లలో ఈ ఫీచర్‌ను యాడ్ చేసేవి. ఆ తర్వాత భారత మార్కెట్లో హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ ఉండేది. అయితే గత మూడేళ్లుగా మిడ్ రేంజ్ ఎస్‌యూవీలలో సన్‌రూఫ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానురాను సన్‌రూఫ్ అనేది కార్లకు తప్పనిసరి ఫీచర్‌గా మారింది. వాహన తయారీ సంస్థలు సైతం వివిధ బడ్జెట్లలో గ్లాస్ రూఫ్, సన్ రూఫ్, పనోరమిక్ సన్‌రూఫ్, స్కై రూఫ్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. అందుకు తగ్గట్టే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ సన్ రూఫ్ ఆప్షన్ ఒక భాగమైంది. ఎస్ యూవీ వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ఉండడంతో సేల్స్ పెరిగిపోతున్నాయని ఆటో మొబైల్ రీసెర్చ్ సంస్థ 'జాటో' తెలిపింది. సర్వేలు ఏం చెబుతున్నాయి సన్‌రూఫ్ ఫీచర్‌కి సంబంధించి 2019తో ఇప్పటి పరిస్థితులను పోల్చితే .. సన్‌రూఫ్ ఆప్షన్ ఉన్న కార్ల అమ్మకాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్టు జాటో తెలిపింది. ఈ ఫీచర్ ఉండటం వల్ల కారు ప్రయాణంలో కొత్త రకం అనుభూతిని పొందడంతో పాటు ... కారు శుభ్రంగా ఉండడమే కాకుండా, శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వినియోగదారుల్లో పెరిగింది. -
Skoda Kushaq : హ్యాండ్సమ్ లుక్స్, అదిరే ఫీచర్స్ , ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ:చాలా కాలంగాఎదురు చూస్తున్న 'స్కోడా' తన పాపులర్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేలా సరికొత్తగా స్కోడా కుషాక్‌ను ఆవిష్కరించింది. తద్వారా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలికింది. యాక్టివ్, అంబిషన్, స్టైల్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇక ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్10.50 లక్షల ధరలతో ప్రారంభించి, టా ప్ ఎండ్ మోడల్ ధరను 17.60 లక్షలుగా నిర్ణయించింది. కస్టమర్లు ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.'వన్ నేషన్. వన్ ప్రైస్' ఫిలాసఫీని ముందుకు తీసుకువెళుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్కోడా కుషాక్ ఫీచర్లు: సరికొత్త ఫీచర్లతో భారతీయ కస్టమర్లకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ , బిగ్ రియర్ బంపర్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సన్‌రూఫ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎంక్యూబీ-ఏవో-ఇన్ ప్లాట్‌పాంలో స్కోడా కుషాక్ తొలి మోడల్ ఎస్యూవీ కావడం విశేషం. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం. బేస్ వేరియంట్లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జత చేసింది. ఇక టాప్-ఆఫ్-లైన్ మోడల్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.1.5-లీటర్ వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్పి పవర్, 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ , కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం.నాలుగు సంవత్సరాల / 1,00,000 కిమీల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది. దీన్ని ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాదు 2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. Premium comes in a range of beautiful and elegant colors with the new ŠKODA KUSHAQ. Book your test drive today: https://t.co/wCzjc6JAC6 Book Online: https://t.co/j1PCblIXIo#SKODA #SKODAKUSHAQ pic.twitter.com/f1pcdm8VQQ — ŠKODA AUTO India (@SkodaIndia) June 28, 2021 -
స్కోడా ‘కుషాక్’
సాక్షి, ముంబై: చెక్ దేశపు వాహన తయారీ సంస్థ స్కోడా గురువారం తన కొత్త కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ తలపెట్టిన ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ ఘనతకెక్కనుంది. మధ్య తరహా ఎస్యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇవ్వనుంది. స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 115 బీహెచ్పీ శక్తిని, 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండోది 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్పీ శక్తిని విడుదల చేసింది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీఎస్జీ గేర్‌బాక్స్ కలిగి ఉంది. స్కోడా కుషాక్ ధరలు జూన్ లేదా జూలైలో ప్రకటించనున్నారు. బుకింగ్స్ జూన్‌లో ప్రారంభమవుతాయి, జూలై 2021 నాటికి కుషాక్ కార్ల డెలివరీలు ప్రారంభం కావచ్చని స్కోడా సంస్థ భావిస్తోంది. -
మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ లగ్జరీ కారు
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల్లో క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) జి-క్లాస్ సెగ్మెంట్లో టాప్ మోడల్‌ను ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్‌గా తీసుకొచ్చిన ఈ కారు ధర రూ .1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. జి-క్లాస్ కు సంబంధించి మొట్టమొదటి నాన్-ఎఎమ్‌జి-డీజిల్ వేరియంట్లోజీ350డితో పాటు ఎస్యువి పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఎనిమిది మోడళ్లు జీఎల్ఎ, జీఎల్సి, జీఎల్ఇ, జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్, ఏఎంజి జీఎల్సి 43 4 మాటిక్, జిఎల్ఇ కూపే , ఏఎంజీ జీ63 ఉన్నాయి. ఈ కారులో 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 600 ఎన్ఎం టార్చ్, 282 బీహెచ్పీ పవర్‌ను అందించనుంది. ఫోర్ వీల్ డ్రైవ్, గ్యాస్ షాక్ అబ్జర్వర్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ, జీప్ రాంగ్లర్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. ఐకానిక్ జి-క్లాస్లోతమ మా వినియోగదారుల కోసం 15 కి పైగా స్పెషాలిటీ , ఏఎంజీ కార్లను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు.ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో అద్భుతమైన స్పందన ఉందనీ, లగ్జరీలో నాయకత్వ స్థానాన్ని కొనసాగించగలమనే విశ్వసాన్ని ఆయన వ్యక్తంచేశారు. కాగా దేశీయంగా ఒకటిన్నర సంవత్సరాలుగా ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభంలోఉన్నప్పటికీ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా జనవరి ఈ నెల ప్రారంభంలో 10,000 యూనిట్ మార్కును దాటింది. అయితే 2018లో 11,789 యూనిట్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 16 శాతం తగ్గి 9,915 యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
బీఎండబ్ల్యూ ఎక్స్ 3 పెట్రోల్ వెర్షన్ లాంచ్
బీఎండబ్ల్యూ కంపెనీ కొత్త కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. పూర్తిగా చెన్నైప్లాంట్లో రూపొందించిన ఎక్స్ 3 ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా నేటినుంచే లభ్యంకానుంది. లగ్జరీ డిజైన్‌తో రూపొందించిన ఈ కారుధరను రూ.56.90లక్షలు( ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజీన్, నాలుగు సిలిండర్ల టర్బో 252 హెచ్‌పీ, 350ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుటుందని కంపెనీ పేర్కొంది. సెకండ్ జనరేషన్మోడల్తో పోలిస్తే ఇంటీరియర్‌లో 12.3 ఇంచెల్ మల్టీ ఫంక్షన్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లేతో పాటు ఇతర భారీ మార్పులు చేసింది. -
మన రోడ్లపై కియా
సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్ ఆటో దిగ్గజం కియా మోటార్స్ భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీని బుధవారం ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఎస్పీ కాన్సెప్ట్‌తో పిలిచే ఈ కార్లు 2019లో భారత రోడ్లపై సందడి చేస్తాయని తెలిపింది. మార్కెట్ ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ధర నిర్ణయిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. ఏపీలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నెలకొల్పనున్న కియా మోటార్స్ భారత్‌లో తొలుత ప్రవేశపెట్టనున్న ఎస్‌యూవీని ఆటో ఎక్స్పో వేదికగా ఆవిష్కరించింది. భారత్‌లో రూ 7000 కోట్లు పైగా పెట్టుబడులు పెట్టనున్న కంపెనీ ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. భారత్‌లో రాబోయే రోజుల్లో ఎలక్ర్టిక్ వాహనాలకు మెరుగైన డిమాండ్ ఉంటుందని కియో అంచనా వేస్తోంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
షో షురూ...
అంగరంగ వైభవంగా 12వ భారత ఆటో షో అరంభమైంది. దేశ, విదేశీ కంపెనీలు కొత్త కొత్త వేరియంట్లు, కాన్సెప్ట్ కార్లతో ఆటో షోను ముంచెత్తుతున్నాయి. ఈ ఆటో షోతోనైనా డిమాండ్ పుంజుకుని సుదీర్ఘ మందగమనానికి తెరపడుతుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ)లు సంయుక్తంగా ఈ ఆటో షోను నిర్వహిస్తున్నాయి. స్థలాభావం చేత ఈ సారి ఆటో షో రెండు చోట్ల జరుగుతోంది. గ్రేటర్ నోయిడాలో మోటార్ షో, ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శన జరుగుతోంది. ఆటో షోలో బుధవారం ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్లు సందడి చేశారు. ఆ ఆటోషోకు ఈ నెల 7 నుంచి 11 వరకూ సందర్శకులను అనుమతిస్తారు. టికెట్లు రూ.200, రూ.500గా నిర్ణయించారు. 1. హస్టర్ బైక్(650 సీసీ)తో హీరో మోటోకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ 2. జనరల్ మోటార్స్ షెవర్లే 2014 కర్వెట్టి స్టింగ్రేతో మోడల్స్ 3. హార్లే డేవిడ్సన్ అత్యంత చౌక బైక్(ధర రూ.4.1 లక్షలు)ను ఆవిష్కరించిన హర్లే డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్ 4. టాటా మోటార్స్ కాన్సెప్ట్ కారు నెక్సన్తో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ గ్రేటర్ నోయిడా: దేశ, విదేశీ వాహన కంపెనీలు కాన్సెప్ట్ కార్లు, కొత్త వేరియంట్లతో ముంచెత్తాయి. మారుతీ సుజుకి కంపెనీ రెండు కాన్సెప్ట్ కార్లు- సెడాన్ సియాజ్, క్రాసోవర్ ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్లను ఆవిష్కరించింది. స్విఫ్ట్, ఆల్టో, రిట్జ్, ఎర్టిగ, డిజైర్ వేరియంట్లతో సహా మొత్తం 14 విభిన్నమైన మోడళ్లను ఈ కంపెనీ డిస్ప్లే చేసింది. హ్యుందాయ్ కంపెనీ కొత్త జనరేషన్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ శాంటా ఫేను ఆవిష్కరించింది. ధరలు రూ. 26.3 లక్షలు నుంచి రూ.29.2 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఫోర్డ్ కంపెనీ రెండు మిడ్-సైజ్ సెడాన్లు ఫియస్టా, ఫిగో కాన్సెప్ట్‌లను ఆవిష్కరించింది. టాటా మోటార్స్ రెండు కాన్సెప్ట్ కార్లు-నెక్సన్(కాంపాక్ట్ ఎస్యూవీ), కనెక్ట్ నెక్స్ట్లతో పాటు మొత్తం 18 కార్లను డిస్ప్లే చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన రెనో కంపెనీ క్విడ్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. స్ట్టీరింగ్ కుడి, ఎడమ వైపున కాకుండా మధ్యలో ఉండడం ఈ కార్ ప్రత్యేకత. జనరల్ మోటార్స్ కంపెనీఎస్యూవీ షెవర్లే ఆడ్రాను డిస్ప్లే చేసింది. ఇక టయోటా కంపెనీ కొరిల్లా ఆల్టిస్‌లో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఫియట్ కంపెనీ మూడు కార్లు-అవెంచుర మల్టీ పర్పస్ వెహికల్, అబర్త్ 500 హ్యాచ్బాక్లను ఆవిష్కరించింది. హోండా కంపెనీ రెండు మోడళ్లు-హోండా మొబిలియో, థర్డ జనరేషన్ హోండా జాజ్‌ను ఆవిష్కరించింది. వీటితో పాటు హోండా విజన్ ఎక్స్ఎస్-1(కాన్సెప్ట్ యుటిలిటి వెహికల్), ఎస్ఎస్ఎక్స్ కాన్సెప్ట్, అకార్డ్ హైబ్రిడ్లనూ డిస్ప్లే చేసింది. ఫోక్స్‌వ్యాగన్ కాన్సెప్ట్ ఎస్యూవీ తైగన్ను ఆవిష్కరించింది. ఇసుజు మోటార్స్ రూ.7-9 లక్షల రేంజ్లో ధర ఉండే మల్టీయుటిలిటి పికప్ ట్రక్- ఇసుజు డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్‌ను ఆవిష్కరించింది. ప్రభుత్వ అనుమతులు రాగానే క్వాడ్రిసైకిల్, ఆర్ఈ60ను మార్కెట్లోకితెస్తామని బజాజ్ తెలిపింది. హార్లే డేవిడ్సన్ చౌక బైక్ ఇక టూవీలర్ల విషయానికొస్తే, హర్లే డేవిడ్సన్ అతి చౌక బైక్, స్ట్రీట్ 750ను ఆవిష్కరించింది. ధర రూ.4.1 లక్షలు. స్ట్రీట్ 750 బైక్‌తో పాటు ఫ్యాట్ బాయ్, స్ట్రీట్ బాబ్, స్ట్రీట్ గ్లైడ్ తదితర మోడళ్లను కూడా డిస్ప్లే చేసింది. వీటి ధరలు రూ.4.1 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్లో ఉన్నాయి. దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ 100 సీసీ కేటగిరిల్లో రెండు కొత్త బైక్‌లను - స్ప్లెండర్ ప్రొ క్లాసిక్, ప్యాసన్ టీఆర్‌లను ఆవిష్కరించింది. లగ్జరీ కార్ల జోరు... వీఐపీల కోసం బుల్లెట్‌ప్రూఫ్ ఎస్యూవీ ఎంఎల్-గార్డ్‌ను మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ధర రూ.2.49 కోట్లు. మరో లగ్జరీ కంపెనీ ఆడి సెడాన్ ఏ3ను లాంఛనంగా ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ కంపెనీ కూడా నాలుగు కార్లను ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో(ధర రూ.42.75 లక్షలు), ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎ6 గ్రాన్ కూప్లను డిస్ప్లే చేసింది. ఈ కార్లను క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.