మెర్సిడెస్‌ బెంజ్‌  జీ-క్లాస్‌ లగ్జరీ కారు | Mercedes-Benz launches G-class SUV G350d  priced at Rs 1.50 cr        | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్‌ బెంజ్‌  జీ-క్లాస్‌ లగ్జరీ కారు

Published Wed, Oct 16 2019 5:04 PM | Last Updated on Wed, Oct 16 2019 5:14 PM

Mercedes-Benz launches G-class SUV G350d  priced at Rs 1.50 cr        - Sakshi

సాక్షి, ముంబై:   జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత మార్కెట్లో లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల్లో  క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) జి-క్లాస్  సెగ్మెంట్‌లో టాప్ మోడల్‌ను ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్‌గా తీసుకొచ్చిన ఈ కారు ధర రూ .1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. జి-క్లాస్ కు సంబంధించి మొట్టమొదటి నాన్-ఎఎమ్‌జి-డీజిల్ వేరియంట్‌లోజీ350డితో పాటు ఎస్‌యువి పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఎనిమిది మోడళ్లు జీఎల్‌ఎ, జీఎల్‌సి, జీఎల్‌ఇ, జిఎల్‌ఎస్ గ్రాండ్ ఎడిషన్, ఏఎంజి జీఎల్‌సి 43 4 మాటిక్, జిఎల్‌ఇ కూపే , ఏఎంజీ జీ63  ఉన్నాయి.

ఈ కారులో 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 600 ఎన్ఎం టార్చ్, 282 బీహెచ్‌పీ పవర్‌ను అందించనుంది. ఫోర్ వీల్ డ్రైవ్, గ్యాస్ షాక్ అబ్జర్వర్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.  ఈ కారు టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ, జీప్ రాంగ్లర్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. 

ఐకానిక్ జి-క్లాస్‌లోతమ  మా వినియోగదారుల కోసం 15 కి పైగా స్పెషాలిటీ , ఏఎంజీ కార్లను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు.ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో  అద్భుతమైన  స్పందన ఉందనీ, లగ్జరీలో నాయకత్వ స్థానాన్ని కొనసాగించగలమనే విశ్వసాన్ని ఆయన వ్యక్తంచేశారు. కాగా దేశీయంగా ఒకటిన్నర సంవత్సరాలుగా   ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభంలోఉన్నప్పటికీ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా జనవరి ఈ నెల ప్రారంభంలో 10,000 యూనిట్ మార్కును దాటింది.  అయితే 2018లో 11,789 యూనిట్లతో పోలిస్తే  ఈ సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 16 శాతం తగ్గి 9,915 యూనిట్లను  మాత్రమే విక్రయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement