Mercedes-Benz India
-
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్‌సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్‌లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే బంపరాఫర్, రూ.7లక్షల భారీ డిస్కౌంట్!
భారతీయులకు శుభవార్త. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్‌పై బంపరాఫర్ ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మెర్సిడెజ్ బెంజ్ సంపన్నులను టార్గెట్ చేస్తూ 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో ఎక్స్ షోరూమ్ ధర రూ.99.3లక్షలతో మెర్సిడెజ్ బెంజ్ఈక్యూసీని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మ్యానిఫ్యాక్చరింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగడంతో రెండు సార్లు ఆ వెహికల్ ధరల్ని పెంచింది. దీంతో బెంజ్ కారు ధర రూ.1.06కి చేరింది. తాజాగా ఆ కారుపై రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు కారణంగా దేశీయ మార్కెట్లో ఈ కారు తరహా ఫీచర్లతో బీఈవీ ఎస్యూవీ వెహికల్స్ విడుదలయ్యాయి. ఆ వెహికల్స్ దెబ్బతో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ వెహికల్స్ సేల్స్ తగ్గాయి. అందుకే ఆ పోటీ తట్టుకొని సేల్స్ జరిపేలా భారీ డిస్కౌంట్ ఇస్తూ ఈ కీలకం నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంతంటే? 80కేడ్ల్యూహెచ్ బ్యాటరీ, 20.8-19.7కేడబ్ల్యూహెచ్/100కేఎం..402.3బీపీహెచ్ ఉండగా మ్యాక్స్ పవర్ 760ఎన్ఎంతో పీక్ టార్క్ అందిస్తుంది. స్పీడ్ 5.1 సెకండ్స్లో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్లగా టాప్ స్పీడ్ గంటకు 180కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇక ఈ కారును సింగిల్ ఛార్జ్‌తో 471కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయోచ్చు. అంతేకాదు ఈ కారులో మూడు ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని మెర్సిడెంజ్ బెంజ్ ప్రతినిధులు చెబుతున్నారు అందులో హోమ్ ఛార్జింగ్, ఏసీ వాల్ అవుట్లెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలున్నాయి. 50కేడ్ల్యూహెచ్ టైప్ కార్ ఫుల్ ఛార్జింగ్ 90నిమిషాల్లో ఎక్కుతుంది.హోమ్ ఛార్జింగ్ యూనిట్ 2.4కేడ్ల్యూహెచ్ ఫుల్ చార్జింగ్ పెట్టేందుకు 21 గంటలు పడుతుండగా..7.4కేడ్ల్యూహెచ్ ఏసీ వాల్ ఛార్జర్ సైతం ఫుల్ ఛార్జింగ్ పెట్టేందుకు 21గంటల సమయం పడుతుంది. ఇక లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ కారుపై అపరిమితంగా సర్వీసింగ్‌తో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో 5ఏళ్ల వారంటీని..ఈక్యూసీ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని అందిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. చదవండి: సంచలనం! ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు! -
మెర్సిడెస్ బెంజ్ నుంచి అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ కార్..! ధర ఎంతంటే..?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లలోకి సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారును శుక్రవారం (నవంబర్ 19)న లాంచ్ చేసింది. ఏఎమ్‌జీ ఏ 45ఎస్ 4మ్యాటిక్‌ప్లస్ ఎడిషన్ హ్యచ్‌బ్యాక్ కారును మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 79.50 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉండనుంది. ఈ కారు ఇంజిన్ విషయానికి వస్తే..టర్బోఛార్జ్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను కారులో అమర్చారు. 3.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 270 కి.మీలుగా ఉంది. హ్యచ్ బ్యాక్ కారు లాంచ్‌తో ఏ-క్లాస్ పోర్ట్‌ఫోలియోను మరింతగా బలోపేతం చేస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సీఈవో మార్టిన్ వెల్లడించారు . అంతేకాకుండా దేశంలోనే అత్యంత వేగవంతమైన హ్యచ్‌బ్యాక్ కార్లలో ఏఎమ్‌జీ ఏ 45ఎస్ 4మ్యాటిక్‌ప్లస్ నిలుస్తోందని తెలిపారు. ఈ కొత్త కారును మెర్సిడెస్ బెంజ్ డీలర్ల వద్ద, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వచ్చే ఏడాది విడుదలయ్యే సూపర్ బైక్స్ ఇవే..! -
మార్కెట్లోకి మెర్సిడెస్ ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ’
ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్ ఇండియా’ తన ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్–హాప్ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ 400 డీ’ ధర రూ. 1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్ మోడల్లో 2.0 లీటర్ల 4–సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను.. హిప్–హాప్లో 3.0 లీటర్ల 6–సిలిండర్ డీజిల్ ఇంజిన్ అమర్చింది. జీఎల్ఈ మోడల్ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. లగ్జరీ ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ మోడల్ అత్యధిక అమ్మకాలను నమోదుచే సిందని సంస్థ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ లగ్జరీ కారు
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల్లో క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) జి-క్లాస్ సెగ్మెంట్లో టాప్ మోడల్‌ను ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్‌గా తీసుకొచ్చిన ఈ కారు ధర రూ .1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. జి-క్లాస్ కు సంబంధించి మొట్టమొదటి నాన్-ఎఎమ్‌జి-డీజిల్ వేరియంట్లోజీ350డితో పాటు ఎస్యువి పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఎనిమిది మోడళ్లు జీఎల్ఎ, జీఎల్సి, జీఎల్ఇ, జిఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్, ఏఎంజి జీఎల్సి 43 4 మాటిక్, జిఎల్ఇ కూపే , ఏఎంజీ జీ63 ఉన్నాయి. ఈ కారులో 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 600 ఎన్ఎం టార్చ్, 282 బీహెచ్పీ పవర్‌ను అందించనుంది. ఫోర్ వీల్ డ్రైవ్, గ్యాస్ షాక్ అబ్జర్వర్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ, జీప్ రాంగ్లర్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. ఐకానిక్ జి-క్లాస్లోతమ మా వినియోగదారుల కోసం 15 కి పైగా స్పెషాలిటీ , ఏఎంజీ కార్లను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు.ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో అద్భుతమైన స్పందన ఉందనీ, లగ్జరీలో నాయకత్వ స్థానాన్ని కొనసాగించగలమనే విశ్వసాన్ని ఆయన వ్యక్తంచేశారు. కాగా దేశీయంగా ఒకటిన్నర సంవత్సరాలుగా ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభంలోఉన్నప్పటికీ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా జనవరి ఈ నెల ప్రారంభంలో 10,000 యూనిట్ మార్కును దాటింది. అయితే 2018లో 11,789 యూనిట్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 16 శాతం తగ్గి 9,915 యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
జాబిలి తీరం : బెంజ్ అద్భుత ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుత క్షణాలు మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్- 2’ లోని విక్రమ్ ల్యాండర్ అందనంత ఎత్తా జాబిలమ్మా..సంగతేద్దో చూద్దాం రా.. అంటూ జాబిల్లిపై దిగనుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు..అంటే సెప్టెంబరు 7న చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మకమైన ఆ మధుర క్షణాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ వినూత్నంగా స్పందించింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ..భారత ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఇస్రో సంస్థకు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేసింది. సైడ్ మిర్రర్లో జాబిల్లిని చాలా దగ్గరగా ఫోకస్ చేసింది. ఆబ్జెక్ట్స్ ఇన్‌ద మిర్రర్ ఆర్ క్లోజర్ దేన్ దే అప్పియర్ అని హెచ్చరించే.. మిర్రర్ ఫోటోతో తనదైన శైలిలో ట్వీట్ చేసింది. చదవండి : ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ A moment in history that was always meant to be made. Congratulations to team ISRO for taking India this far! #Chandrayaan2#Chandrayaan2Live pic.twitter.com/YCQfU96TRQ — Mercedes-Benz India (@MercedesBenzInd) September 6, 2019 -
మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్ లగ్జరీ కార్ల తయారీదారు భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విధానం పై దృష్టి సారించింది. ఈ మేరకు మేకిన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుణేలో ఒక ఇ-వాహన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో రోజుకు రోజుకు విస్తరిస్తున్న కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పుంజుకోనుందని కంపెనీ భావిస్తోంది. ఇ-వాహనాల మార్కెట్లో భారతీయ మార్కెట్ చాలా కీలకం కానుందని భావిస్తున్న బెంజ్ ఈ నిర్ణయం తీసుకుంది. పూనేలోని చకన్లో ఈ కర్మాగారాన్ని నిర్మించనుంది. అంతేకాదు న్యూ ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ 'ఈక్యూ' వాహనాలను వచ్చే ఏడాది నుంచి యొక్క ప్రపంచ అమ్మకాలు ప్రారంభించనుంది. ఈక్యూ బ్రాండ్ కాన్సెప్ట్ కార్లను ఢిల్లీలో జరిగిన 2018 మోటార్ షోలో పరిచేయం చేసింది. భారత మార్కెట్ ఎలక్ట్రానిక్ కార్ల వైపు కదులుతున్నందున తమ దీర్ఘకాలి ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కోరుకుంటున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు & మార్కెటింగ్) మైఖేల్ జోప్ చెప్పారు. కాగా కేంద్ర ఈ తరహా వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా బెంజ్ ఎస్ 63 ఎఏంజీ కూపేను లాంచ్ చేసింది. రూ. 2.55 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
మెర్సిడెస్ ‘జీఎల్ఏ క్లాస్’.. కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.30.65 లక్షలు ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్ ఇండియా’ తన ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంది. ఇది తాజాగా ‘జీఎల్ఏ క్లాస్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. డైనమిక్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఎస్యూవీ ప్రధానంగా జీఎల్ఏ 200, జీఎల్ఏ 200 డీ, జీఎల్ఏ 220 డీ 4 మ్యాటిక్ అనే మూడు ఇంజిన్ వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జీఎల్ఏ 200 డీ 2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.30.65 లక్షలుగా, 2.2 లీటర్ 4 మ్యాటిక్ డీజిల్ వేరియంట్ ధర రూ.36.75 లక్షలుగా ఉంది. ఇక అన్నింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్న ఏడో మోడల్ ఇది. దీన్ని చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. -
మార్కెట్లోకి మెర్సిడెస్ ‘మేడిన్ ఇండియా’ జీఎల్సీ
పుణే: దేశీ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్ ఇండియా’ తాజాగా దేశీయంగా తయారుచేసిన జీఎల్సీ క్లాస్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ స్థానికంగా తయారు చేసిన తొమ్మిదో మోడల్ ఇది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను జూన్ నెలలో ఇంపోర్టెడ్ యూనిట్‌గా (విదే శాల నుంచి దిగుమతి) భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఒక మోడల్‌ను దేశీయంగా తయారు చేసి దాన్ని మార్కెట్ లోకి తీసుకురావడం మెర్సిడెస్‌కే చెల్లింది. ఈ కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 2.1 లీటర్ జీఎల్సీ 220డీ ఎంట్రీ మోడల్ డీజిల్ వెర్షన్ ధర రూ.47.9 లక్షలుగా, 1.99 లీటర్ టాప్ ఎండ్ జీఎల్సీ 300 పెట్రోల్ వెర్షన్ ధర రూ.51.9 లక్షలుగా ఉందని పేర్కొంది. (ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి). -
మెర్సిడెస్ కొత్త ఈ-క్లాస్ ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఈ-క్లాస్ సెడాన్ మోడల్లోనే కొత్త వెర్షన్ ‘ఎడిషన్ ఈ’ ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ‘ఈ200’, ‘ఈ250 సీడీఐ’, ‘ఈ350 సీడీఐ’ అనే మూడు వేరియంట్లలో లభ్యంకానున్నది. వీటి ధరలు వరుసగా రూ.48.60 లక్షలుగా, రూ.50.76 లక్షలుగా, రూ.60.61 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ పుణేవి. ఈ200 వేరియంట్లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఈ250 సీడీఐలో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, ఈ350 సీడీఐలో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ మూడు వేరియంట్లలోనూ 7 స్పీడ్ ఆటోమేటిక్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ-క్లాస్ మోడల్ ఉత్పత్తి ప్రారంభమై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా కంపెనీ కొత్త ‘ఎడిషన్ ఈ’ వెర్షన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ-క్లాస్ మోడల్ తయారీ 1995లో ప్రారంభమైంది. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన లగ్జరీ కారు ఇదే. -
మెర్సిడెస్ పవర్ఫుల్ ఎస్యూవీ
ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ), జీఎల్ 63 ఏఎంజీని మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.66 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లోకి తెస్తున్న ఏఎంజీ రేంజ్ వాహనాల్లో ఇది మొదటిదని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 5.5 లీటర్ వీ8 బైటర్బో పవర్ ట్రైన్‌తో రూపొందిన ఈ కారు 0-100 కి.మీ. వేగాన్ని 4.6 సెకన్లలో అందుకుంటుంది. 7 గేర్లు (ఆటోమేటిక్), ఆల్ వీల్ డ్రైవ్, మూల మలుపులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసేలా యాక్టివ్ కర్వ్ కంట్రోల్, బాంగ్ అండ్ ఓలుఫ్సెన్ ఆడియా సిస్టమ్, సిరస్ శాటిలైట్ రేడియో, పనోరమిక్ సన్‌రూఫ్, ట్రై జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌కు ఈ కొత్త మెర్సిడెస్ ఎస్యూవీ గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ ఏడాది 10 మోడళ్లు కాగా ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 10 కొత్త మోడళ్లను అందించనున్నామని కెర్న్ వివరించారు. ఈ కారు తమ వినియోగదారులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది తమ అమ్మకాలు 32 శాతం వృద్ధి చెంది 9,003కు చేరాయని వివరించారు. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి అమ్మకాలు 27 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని వివరించారు. పుణేలోని చకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఎస్, ఈ, సీ, జీఎల్, ఎం- క్లాస్ మోడల్ కార్లను భారత్‌లోనే తయారు చేస్తోంది. ఏ, సీఎల్ఎస్, ఎస్‌ఎల్‌కే-క్లాస్, లగ్జరీ టూరర్ బి-క్లాస్, లగ్జరీ ఎస్యూవీ జీఎల్ 63 ఏఎంజీలను దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. -
మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.36.81 లక్షల నుంచి రూ.39.16 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ముంబై) ఉన్నాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ తెలిపారు. పుణేలోని చకన్ ప్లాంట్‌లో 50వేల కార్లు ఉత్పత్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు..: 2,143 సీసీ (డీజిల్), 1,796 సీసీ (పెట్రోల్), ఇంజిన్ సామర్థ్యం శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన మల్టీ కలర్ డిస్ప్లే. కొత్త పనోరమిక్ సన్‌రూఫ్. 7జీ-ట్రానిక్ ప్లస్ ఆటోమాటిక్ గేర్ బాక్స్, బై గ్జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఏఎంజీ బాడీ కిట్ . ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్షన్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లున్నాయి.