మార్కెట్లోకి మెర్సిడెస్‌ ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ’ | Another motown beauty from Mercedes | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మెర్సిడెస్‌ ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ’

Jan 30 2020 6:04 AM | Updated on Jan 30 2020 6:04 AM

Another motown beauty from Mercedes - Sakshi

ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌–బెంజ్‌ ఇండియా’ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్‌ వీల్‌ బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్‌–హాప్‌ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ’ ధర రూ. 1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్‌ మోడల్‌లో 2.0 లీటర్ల 4–సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను.. హిప్‌–హాప్‌లో 3.0 లీటర్ల 6–సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చింది. జీఎల్‌ఈ మోడల్‌ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో జీఎల్‌ఈ మోడల్‌ అత్యధిక అమ్మకాలను నమోదుచే సిందని సంస్థ సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement