మెర్సిడెస్‌ ‘జీఎల్‌ఏ క్లాస్‌’.. కొత్త వేరియంట్‌ | Mercedes-Benz: Mercedes-Benz adds to SUV portfolio: Launches GLA Class in India, starting at Rs 30.65 lakh | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్‌ ‘జీఎల్‌ఏ క్లాస్‌’.. కొత్త వేరియంట్‌

Published Thu, Jul 6 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

మెర్సిడెస్‌ ‘జీఎల్‌ఏ క్లాస్‌’.. కొత్త వేరియంట్‌

మెర్సిడెస్‌ ‘జీఎల్‌ఏ క్లాస్‌’.. కొత్త వేరియంట్‌

ప్రారంభ ధర రూ.30.65 లక్షలు
ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌–బెంజ్‌ ఇండియా’ తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంది. ఇది తాజాగా ‘జీఎల్‌ఏ క్లాస్‌’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. డైనమిక్‌ డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూవీ ప్రధానంగా జీఎల్‌ఏ 200, జీఎల్‌ఏ 200 డీ, జీఎల్‌ఏ 220 డీ 4 మ్యాటిక్‌ అనే మూడు ఇంజిన్‌ వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

జీఎల్‌ఏ 200 డీ 2 లీటర్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.30.65 లక్షలుగా, 2.2 లీటర్‌ 4 మ్యాటిక్‌ డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.36.75 లక్షలుగా ఉంది. ఇక అన్నింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కంపెనీ ఈ ఏడాది మార్కెట్‌లోకి తెస్తున్న ఏడో మోడల్‌ ఇది. దీన్ని చకన్‌ ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement