భారతీయులకు శుభవార్త. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్పై బంపరాఫర్ ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
మెర్సిడెజ్ బెంజ్ సంపన్నులను టార్గెట్ చేస్తూ 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్‌లో ఎక్స్ షోరూమ్ ధర రూ.99.3లక్షలతో మెర్సిడెజ్ బెంజ్‌ఈక్యూసీని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మ్యానిఫ్యాక్చరింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగడంతో రెండు సార్లు ఆ వెహికల్ ధరల్ని పెంచింది. దీంతో బెంజ్ కారు ధర రూ.1.06కి చేరింది. తాజాగా ఆ కారుపై రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు కారణంగా దేశీయ మార్కెట్‌లో ఈ కారు తరహా ఫీచర్లతో బీఈవీ ఎస్‌యూవీ వెహికల్స్ విడుదలయ్యాయి. ఆ వెహికల్స్ దెబ్బతో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ వెహికల్స్ సేల్స్ తగ్గాయి. అందుకే ఆ పోటీ తట్టుకొని సేల్స్ జరిపేలా భారీ డిస్కౌంట్ ఇస్తూ ఈ కీలకం నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంతంటే?
80కేడ్ల్యూహెచ్ బ్యాటరీ, 20.8-19.7కేడబ్ల్యూహెచ్/100కేఎం..402.3బీపీహెచ్ ఉండగా మ్యాక్స్ పవర్ 760ఎన్‌ఎంతో పీక్ టార్క్ అందిస్తుంది. స్పీడ్ 5.1 సెకండ్స్‌లో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్లగా టాప్ స్పీడ్ గంటకు 180కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది.
ఇక ఈ కారును సింగిల్ ఛార్జ్‌తో 471కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయోచ్చు. అంతేకాదు ఈ కారులో మూడు ఛార్జింగ్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయని మెర్సిడెంజ్ బెంజ్ ప్రతినిధులు చెబుతున్నారు అందులో హోమ్ ఛార్జింగ్, ఏసీ వాల్ అవుట్‌లెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలున్నాయి. 50కేడ్ల్యూహెచ్ టైప్ కార్ ఫుల్ ఛార్జింగ్ 90నిమిషాల్లో ఎక్కుతుంది.హోమ్ ఛార్జింగ్ యూనిట్ 2.4కేడ్ల్యూహెచ్ ఫుల్ చార్జింగ్ పెట్టేందుకు 21 గంటలు పడుతుండగా..7.4కేడ్ల్యూహెచ్ ఏసీ వాల్ ఛార్జర్ సైతం ఫుల్ ఛార్జింగ్ పెట్టేందుకు 21గంటల సమయం పడుతుంది. ఇక లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ కారుపై అపరిమితంగా సర్వీసింగ్‌తో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో 5ఏళ్ల వారంటీని..ఈక్యూసీ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని అందిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది.
చదవండి: సంచలనం! ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు!
Comments
Please login to add a commentAdd a comment