మార్కెట్లోకి మెర్సిడెస్ ‘మేడిన్ ఇండియా’ జీఎల్సీ
పుణే: దేశీ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్ ఇండియా’ తాజాగా దేశీయంగా తయారుచేసిన జీఎల్‌సీ క్లాస్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ స్థానికంగా తయారు చేసిన తొమ్మిదో మోడల్ ఇది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను జూన్ నెలలో ఇంపోర్టెడ్ యూనిట్‌గా (విదే శాల నుంచి దిగుమతి) భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఒక మోడల్‌ను దేశీయంగా తయారు చేసి దాన్ని మార్కెట్ లోకి తీసుకురావడం మెర్సిడెస్‌కే చెల్లింది. ఈ కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 2.1 లీటర్ జీఎల్‌సీ 220డీ ఎంట్రీ మోడల్ డీజిల్ వెర్షన్ ధర రూ.47.9 లక్షలుగా, 1.99 లీటర్ టాప్ ఎండ్ జీఎల్‌సీ 300 పెట్రోల్ వెర్షన్ ధర రూ.51.9 లక్షలుగా ఉందని పేర్కొంది. (ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి).