హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్‌సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్‌సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్‌లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్‌లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment