హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో మరో రెండు టాప్ ఎండ్ మోడళ్లను గురువారం విడుదల చేసింది. వీటిలో ఏఎంజీ జీఎల్‌సీ 43 4మేటిక్ కూపే, సీఎల్‌ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎక్స్‌షోరూంలో ప్రారంభ ధర రూ.1.10 కోట్లు. ఏఎంజీ జీఎల్‌సీ 43 4మేటిక్ కూపే మోడల్‌కు 1,991 సీసీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, ఏఎంజీ స్పీడ్íÙఫ్ట్ ఎంసీటీ 9జీ ట్రాన్స్‌మిషన్ పొందుపరిచారు.
గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. సీఎల్‌ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ మోడల్ 1,999 సీసీ ఇన్‌లైన్–4 టర్బోచార్జ్‌డ్ ఇంజన్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో చేరుకుంటుంది. కాగా, 2023–24లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయంగా 18,123 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరి–జూన్‌లో 9 శాతం వృద్ధితో 9,262 యూనిట్లు రోడ్డెక్కాయి. 2024లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మైబాహ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబరులో భారత్‌లో అడుగు పెడుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment