మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ | Mercedes Benz unveils C-Class Grand Edition at Rs 36.81 lakh | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్

Published Wed, Jan 29 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్

మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్

ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.36.81 లక్షల నుంచి రూ.39.16 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ముంబై) ఉన్నాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ తెలిపారు. పుణేలోని చకన్ ప్లాంట్‌లో 50వేల కార్లు ఉత్పత్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని వివరించారు.

 కారు ప్రత్యేకతలు..:  2,143 సీసీ (డీజిల్),  1,796 సీసీ (పెట్రోల్), ఇంజిన్ సామర్థ్యం  శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన మల్టీ కలర్ డిస్‌ప్లే. కొత్త పనోరమిక్ సన్‌రూఫ్. 7జీ-ట్రానిక్ ప్లస్ ఆటోమాటిక్ గేర్ బాక్స్, బై గ్జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఏఎంజీ బాడీ కిట్ . ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్షన్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement