Eberhard Kern
-
మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు
పుణే : మెర్సిడెస్ బెంజ్ ఇండియా(ఎంబీఐ) కంపెనీ సూపర్ లగ్జరీ సలూన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. మేబ్యాక్ ఎస్600 పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.6 కోట్లని (ఎక్స్ షోరూమ్, పుణే) కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. దేశీయంగా అసెంబుల్ చేసిన మేబ్యాక్ ఎస్500ను కూడా అందుబాటులోకి తెచ్చామని, ధర రూ.1.67 కోట్లని పేర్కొన్నారు. ఈ కారుతో తాము దేశీయంగా అసెంబుల్ చేస్తున్న మోడళ్ల సంఖ్య ఎనిమిదికి పెరిగిందని చెప్పారు. దేశీయంగా లగ్జరీ కార్లలో అధిక మోడళ్లను అసెంబుల్ చేస్తున్న కంపెనీ తమదేనని వివరించారు. ప్రస్తుతం తాము సి, ఈ, ఎం, ఎస్ క్లాస్ మోడళ్లను, సీఎల్ఏ, జీఎల్ఏ, జీఏ క్లాస్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తున్నామని తెలిపారు.కాగా ఎంబీఐకు ఇప్పటిదాకా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున కెర్న్ యూరప్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రోలాండ్ ఎస్ ఫోల్జ్ రానున్నారు. ఈ కార్యక్రమంలో రోలాండ్ కూడా పాల్గొన్నారు. -
21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ ఎస్-క్లాస్ ధర
న్యూఢిల్లీ/పుణే: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్(ఎస్-500) ధరను రూ.21 లక్షలు తగ్గించింది. ఈ కారును పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయడం ప్రారంభించామని, అందుకే ధర తగ్గిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబెర్‌హర్డ్ కెర్న్ గురువారం తెలిపారు. డిమాండ్ బాగా ఉండటంతో ఈ కారు అసెంబ్లింగ్‌ను మూడు నెలల ముందే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 40% వరకూ ఉపయోగిస్తున్నామని, ఇక్కడే అసెంబ్లింగ్ చేయడం తదితర కారణాల వల్ల సుంకాలు తగ్గుతుండటంతో ఈ కారు ధరను తగ్గించామని వివరించారు. ఈ కంపెనీ జనవరిలో ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారు రూ.1.57 కోట్ల ధరకు మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల చేసిన 16 రోజుల్లోనే 125 బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. దేశీయంగానే ఈ కారును అసెంబుల్ చేయడం వల్ల ఈ మోడల్లో టాప్ -ఎండ్ వేరియంట్ ఎస్ 500 ధర రూ.1.36 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. దీనికి బుకింగ్స్‌ను గతంలోనే ప్రారంభించామని, జూన్ నుంచి డెలివరీలు ఆరంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఎస్-క్లాస్, ఈ-క్లాస్, సి-క్లాస్, జీఎల్-క్లాస్, ఎం-క్లాస్, బి-క్లాస్ కార్లను ఇక్కడే అసెంబుల్ చేస్తోంది. -
మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.36.81 లక్షల నుంచి రూ.39.16 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ముంబై) ఉన్నాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ తెలిపారు. పుణేలోని చకన్ ప్లాంట్‌లో 50వేల కార్లు ఉత్పత్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు..: 2,143 సీసీ (డీజిల్), 1,796 సీసీ (పెట్రోల్), ఇంజిన్ సామర్థ్యం శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన మల్టీ కలర్ డిస్ప్లే. కొత్త పనోరమిక్ సన్‌రూఫ్. 7జీ-ట్రానిక్ ప్లస్ ఆటోమాటిక్ గేర్ బాక్స్, బై గ్జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఏఎంజీ బాడీ కిట్ . ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్షన్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లున్నాయి. -
మార్కెట్లోకి మరో కొత్త మోడల్ బెంజ్ కారు!
కొత్త లగ్జరీ కారును జర్మనీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడేజ్ బెంజ్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఎస్ఎల్ కే 55 ఏఎమ్ జీ అనే మోడల్ కారును ప్రవేశపెట్టినట్టు బెంజ్ ఇండియా మేనేజర్ తెలిపారు. ఎక్స్ షో రూమ్ ధర 1.26 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. రెండు సీట్లు, 5.5 లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజన్ దీని ప్రత్యేకత అని తెలిపారు. భారత్ లో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన కార్లలో ఇది ఎనిమిదవది అని తెలిపారు. భారత వినియోగదారుల కోసం తమ గ్లోబల్ పోర్ట్ ఫోలియో నుంచి ప్రత్యేకంగా అందించామని సీఈఓ ఎబెర్ హార్డ్ కెర్న్ తెలిపారు. ఈ సంవత్సరంలో కాంపాక్ట్ లగ్జరీ కార్ ఏ క్లాస్, బీ క్లాస్ డీజిల్, జీఎల్ క్లాస్ లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన వాటిలో ఉన్నాయి. బెంజ్ కార్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది అని కెర్న్ సంతోషం వ్యక్తం చేశారు.