21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ ఎస్-క్లాస్ ధర | Mercedes starts local assembly of S-Class in India | Sakshi
Sakshi News home page

21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ ఎస్-క్లాస్ ధర

Published Fri, Mar 14 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ ఎస్-క్లాస్ ధర

21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ ఎస్-క్లాస్ ధర

న్యూఢిల్లీ/పుణే: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్(ఎస్-500) ధరను రూ.21 లక్షలు తగ్గించింది. ఈ కారును పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయడం ప్రారంభించామని, అందుకే ధర తగ్గిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబెర్‌హర్డ్ కెర్న్ గురువారం తెలిపారు.   డిమాండ్ బాగా ఉండటంతో ఈ కారు అసెంబ్లింగ్‌ను మూడు నెలల ముందే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 40% వరకూ ఉపయోగిస్తున్నామని, ఇక్కడే అసెంబ్లింగ్ చేయడం తదితర కారణాల వల్ల సుంకాలు తగ్గుతుండటంతో ఈ కారు ధరను తగ్గించామని వివరించారు.

ఈ కంపెనీ జనవరిలో ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారు రూ.1.57 కోట్ల ధరకు మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల చేసిన 16 రోజుల్లోనే 125 బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. దేశీయంగానే ఈ కారును అసెంబుల్ చేయడం వల్ల ఈ మోడల్‌లో టాప్ -ఎండ్ వేరియంట్ ఎస్ 500 ధర రూ.1.36 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. దీనికి బుకింగ్స్‌ను గతంలోనే ప్రారంభించామని, జూన్ నుంచి డెలివరీలు ఆరంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఎస్-క్లాస్, ఈ-క్లాస్, సి-క్లాస్, జీఎల్-క్లాస్, ఎం-క్లాస్, బి-క్లాస్ కార్లను ఇక్కడే అసెంబుల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement