Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు.
నయనతార గిఫ్ట్‌గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment