Aditya Seal And Anushka Ranjan Buys New Expensive Mercedes Benz Car, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Mercedes Benz: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?

Published Mon, Jun 12 2023 9:22 AM | Last Updated on Mon, Jun 12 2023 10:33 AM

Aditya seal and anushka ranjan buys new expensive mercedes benz car - Sakshi

గత కొన్ని రోజులకు ముందు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్‌  లవ్‌బర్డ్స్‌ 'ఆదిత్య సీల్, అనుష్క రంజన్' ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ కపుల్ సొంతం చేసుకున్న ఈ కారు ధర ఎంత? దాని ప్రత్యేకతలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'న్యూ మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి' (Mercedes E-350d AMG) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు డీలర్‌షిప్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు కోరుకునే బెస్ట్ మోడల్. ఇది మంచి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కలిగి, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఐకానిక్ మెర్సిడెస్ గ్రిల్, త్రీ-పాయింటెడ్ స్టార్ ఎంబ్లమ్‌, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ కూడా క్వాలిటీ మెటీరియల్ పొందుతుంది. ఇందులో ఖరీదైన లెదర్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

(ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!)

మెర్సిడెస్ బెంజ్ 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 286 hp పవర్ అండ్ 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి, ఇవన్నీ వాహనం వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

(ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement