ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).
బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment