జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ జిఎల్ఏ, జిఎల్‌బి SUVలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా అడుగుపెడతాయనికి, విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.
డిజైన్ & ఫీచర్స్:
దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త GLA, GLB రెండూ వాటి మునుపటి మోడల్స్ కంటే ఆధునికంగా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో గ్రిల్, బంపర్, లైట్స్ వంటివి కొత్తగా కనిపించనున్నాయి. అయితే వీల్ ఆర్చెస్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, లెదర్ స్టీరింగ్ వీల్, హై-బీమ్ అసిస్ట్, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి వాటితో పాటు యాంబియంట్ లైటింగ్ వంటివి ఉంటాయి. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
పవర్‌ట్రెయిన్స్:
కొత్త అప్డేటెడ్ బెంజ్ కార్లు రెండూ లైట్ వెయిట్ హైబ్రిడ్ ద్వారా శక్తిని పొందుతాయి. అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లలో కొన్ని మార్పులు గమనించవచ్చు. కావున కంపెనీ రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ మంచి పనితీరుని అందిస్తాయని భావిస్తున్నాము. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు కాగా, కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి.
ధరలు:
త్వరలో విడుదలకానున్న కొత్త జిఎల్ఏ, జిఎల్‌బి ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ GLA ప్రారంభ ధరలు రూ. 48.50 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య, GLB ధరలు రూ. 63.80 లక్షల నుంచి రూ. 69.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
(ఇదీ చదవండి: 2023 Hyundai Verna: మొన్న విడుదలైంది.. అప్పుడే దిమ్మతిరిగే బుకింగ్స్)
ప్రత్యర్థులు:
భారతదేశంలో జిఎల్ఏ, జిఎల్‌బి విడుదలైన తరువాత ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ బిఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సి40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment