facelift
-
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్‌లిఫ్ట్ చేసి 2024 మోడల్‌గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్‌తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్‌తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్..
కొత్త ఫీచర్లతో సరికొత్తగా అప్డేట్ చేసిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్‌ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ను రూ. 14.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ను రూ.15.99 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన అప్డేట్తోనైనా ఈ ఎస్యూవీ నెలవారీ విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విభాగంలో టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, కియా కారెన్స్ వంటివి దీనికి పోటీగా ఉన్నాయి.2024 హ్యుందాయ్ అల్కాజార్ లుక్స్ పరంగా క్రెటాను సాగదీసినట్లుగా ఉంటుంది. హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, పెద్ద రేడియేటర్ గ్రిల్ , విశాలమైన స్కఫ్ ప్లేట్‌తో బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్‌తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్ ఇందులో ఇచ్చారు. ఇక వాహనం ఇరువైపులా చేసిన పెద్ద మార్పులు ఏంటంటే.. కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్.ఆల్కాజర్ రియర్ ఫేస్ కూడా కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్‌తో భారీగా సర్దుబాట్లు చేశారు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కూడా దీనికి ఇచ్చారు. కొలతల విషయానికొస్తే, అల్కాజర్ అవుట్గోయింగ్ మోడల్‌తో పోల్చితే 2024 ఆల్కాజర్ 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటాయి. 2,760 ఎంఎం వీల్‌బేస్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్‌లోనూ డ్యాష్బోర్డ్తోపాటు మరికొన్ని మార్పులు చేశారు.అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5లీటర్ డీజిల్, 1.5లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికలు, మూడు డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్లు (స్నో, మడ్, శాండ్) ఉన్నాయి. కొత్త బోల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ 9 రంగులలో లభిస్తుంది. వీటిలో 8 మోనో-టోన్ ఎంపికలు అవి కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాటీ, టైటాన్ గ్రే మ్యాటీ, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫైరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, ఒక డ్యూయల్- బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్‌లో టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. -
భారత్‌లో విడుదలకానున్న జర్మన్ లగ్జరీ కార్లు, ఇవే
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ జిఎల్ఏ, జిఎల్బి SUVలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా అడుగుపెడతాయనికి, విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త GLA, GLB రెండూ వాటి మునుపటి మోడల్స్ కంటే ఆధునికంగా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో గ్రిల్, బంపర్, లైట్స్ వంటివి కొత్తగా కనిపించనున్నాయి. అయితే వీల్ ఆర్చెస్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, లెదర్ స్టీరింగ్ వీల్, హై-బీమ్ అసిస్ట్, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి వాటితో పాటు యాంబియంట్ లైటింగ్ వంటివి ఉంటాయి. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: కొత్త అప్డేటెడ్ బెంజ్ కార్లు రెండూ లైట్ వెయిట్ హైబ్రిడ్ ద్వారా శక్తిని పొందుతాయి. అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్లలో కొన్ని మార్పులు గమనించవచ్చు. కావున కంపెనీ రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ మంచి పనితీరుని అందిస్తాయని భావిస్తున్నాము. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు కాగా, కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. ధరలు: త్వరలో విడుదలకానున్న కొత్త జిఎల్ఏ, జిఎల్బి ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ GLA ప్రారంభ ధరలు రూ. 48.50 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య, GLB ధరలు రూ. 63.80 లక్షల నుంచి రూ. 69.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: 2023 Hyundai Verna: మొన్న విడుదలైంది.. అప్పుడే దిమ్మతిరిగే బుకింగ్స్) ప్రత్యర్థులు: భారతదేశంలో జిఎల్ఏ, జిఎల్బి విడుదలైన తరువాత ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ బిఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సి40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్' భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదవ జనరేషన్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు, కాగా టాప్-స్పెక్ సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కంపెనీ ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 5,000, డీలర్‌షిప్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ & ధరలు: ఎస్వి: రూ. 11.49 లక్షలు వి: రూ. 12.37 లక్షలు విఎక్స్: రూ. 13.49 లక్షలు జెడ్ఎక్స్: రూ. 14.72 లక్షలు కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బంపర్, గ్రిల్, క్రోమ్ బార్ వంటి వాటిని కలిగి ఎల్ఈడీ లైట్స్, స్వెప్ట్‌బ్యాక్ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. వెనుక వైపు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ చూడవచ్చు, అంతే కాకుండా ఈ అప్డేటెడ్ మోడల్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ పెయింట్ షేడ్‌లో చూడచక్కగా కనిపిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బేస్ మోడల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు సివిటి గేర్‌బాక్స్ పొందుతాయి. ఈ కొత్త మోడల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను పొందుతుంది. కంపెనీ ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్లోని ADAS టెక్నాలజీకి "లో-స్పీడ్ ఫాలో" ఫంక్షన్ అని పిలువబడే ఒక కొత్త ఫీచర్‌ను జోడించింది. ఇది ముందున్న వాహనానికి దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల కారు ముందుకు కదిలినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్ మరియు వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్ వంటి ఫీచర్స్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ పెట్రోల్, సిటీ హైబ్రిడ్ రెండింటిపైన మూడు సంవత్సరాలు/అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అందిస్తుంది. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 121 బీహెచ్‌పి పవర్ అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ eCVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ ఈ రెండు ఇంజిన్లను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.31.99 లక్షలు. 2.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్, 7 స్పీడ్ డీఎస్జీ 4మోషన్ ట్రాన్స్మిషన్, ఐక్యూ లైట్‌తో ఇంటెలిజెంట్, అడాప్టివ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, గెశ్చర్ కంట్రోల్‌తో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, యూఎస్బీ సి–పోర్ట్స్, వియెన్నా లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఏర్పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3 జోన్ క్లైమెట్రానిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. -
కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్‌లో అప్డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను దేశంలో విడుదల చేసింది. దీని ధర 5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ) నుండి ప్రారంభం. జనాదరణ పొందిన మారుతి స్విఫ్ట్ కారు ఇంటీరియర్ డిజైన్, కాస్మొటిక్స్ మార్పులతోపాటు భద్రతాపరంగా మెరుగైన ఫీచర్లను జోడింది. 10.67 సెం.మీ మల్టీ-ఇన్ఫర్మేషన్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, కొత్త గ్రిల్, మోడల్ కాంట్రాస్ట్ రూఫ్, కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్ లాంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌లో ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీతో నెక్ట్స్ జనరేషన్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అందించినట్టు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీరిక్యులేషన్ (ఇజిఆర్) వ్యవస్థతో పాటు కొత్త స్విఫ్ట్ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని, అధిక ఇంధన సామర్థ్యం దీని సొంతమని పేర్కొంది. -
హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటో సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ మోడల్ 2020 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు 8.50 లక్షల నుండి ప్రారంభమై 10.99 లక్షల రూపాయల వరకు (అన్ని ధరలు,ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించాలనుకున్నా కరోనావైరస్ మహమ్మారితో ఆలస్యమైందని జపాన్ కార్ మేకర్ వెల్లడించింది. రిఫ్రెష్ స్టైలింగ్, కొత్త ఫీచర్లతో బీఎస్-6 ఫార్మాట్లో అప్ డేట్ చేసింది. పెట్రోలు, డీజిల్ ఇంజీన్లతో ఎస్ వీ, వీక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే ఇది లభ్యం కానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ డిజైన్, ఫీచర్లు బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. డీజిల్ వెర్షన్ వాహనం 99 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వాహనమైతే 89 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ లాంటివి జోడించింది. 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే..మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ లాంటివి ప్రధానంగా గట్టిపోటీ ఇవ్వనున్నాయి. -
సరికొత్తగా మారుతి బాలెనో ఆర్ఎస్ ఫేస్‌లిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు బాలెనో ఆర్ఎస్ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్డేట్స్తో మారుతి బాలెనో ఆర్ ఎస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆకర్షణీయంగా కంపెనీ తీసుకొస్తోంది. ఈ నెల చివరకు మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ధర విషయానికి వస్తే..రూ.8.53లక్షలుగా (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉండవచ్చని అంచనా. 1.0 లీటర్ పెట్రోలు బూస్టర్ జెట్ టర్బో ఇంజీన్‌తో మరింత శక్తివంతంగా ఈ కారును లాంచ్ చేయనుంది. ఫ్రంట్ బంపర్‌లో మార్పులతోపాటు పాత హెచ్ఐడీ ల్యాంప్స్‌కు బదులుగా కొత్త ఎల్ఈడీ హెడ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అమర్చింది. అలాగే రియర్ డిస్క్ బ్రేక్‌లను, బ్లాక్ అండ్ సిల్వర్ డ్యుయల్ టోన్ కొత్త అల్లోయ్ వీల్స్‌ను కొత్తగా జోడించింది. డార్క్ గ్రే కలర్లో ఇంటీరియర్ డిజైన్‌ను ఇచ్చింది. దీంతోపాటు స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను స్మార్ట్‌ఫోన్ నావిమాప్స్ నావిగేషన్ ఆప్‌తో అప్డేట్ చేసింది. -
స్టయిలిష్‌గా టాటా కొత్త టైగోర్
సాక్షి,న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా సరికొత్త కాంపాక్ట్ సెడాన్ న్యూలుక్‌తో రీలాంచ్ చేసింది. దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని టైగోర్ ఫేస్‌లిప్ట్‌ను లాంచ్ చేసింది. లుక్స్, ఫీచర్స్, డిజైన్‌లో మార్పులు చేసి స్టయిలిష్లుక్లో కొత్త టైగోర్ను విడుదల చేసింది. 15 అంగుళాల డ్యుయల్ టోన్ అల్లోయ్ వీల్స్, క్రిస్టల్ ఎ ల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు, ఇంటీరియర్ లుక్స్‌లో కూడా అప్డేట్ చేసింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల ఇన్పోటేన్మెంట్ టచ్ స్క్రీన్ విత్, 4 స్పీకర్లు, 4 ట్వీటర్స్ను జోడించింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఆరు రంగుల్లో ఇది లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కార్ల ధరను 5.20-6.65 లక్షల రూపాయిలు మధ్య నిర్ణయించింది. అలాగే డీజిల్ వెర్షన్ కార్ల ధరలను రూ.6.09 -7.38లక్షలుగా ఉంచింది. -
స్టైలిష్ లుక్‌లో స్కోడా ర్యాపిడ్
ఆటోమొబైల్ తయారీదారు స్కోడా తన తాజా స్కోడా ర్యాపిడ్ ను న్యూ లుక్ లో భారత మార్కెట్ లో గురువారం లాంచ్ చేయనుంది. ర్యాపిడ్ ఫేస్ లిఫ్ట్ లో పూర్తిగా అభివృద్ది చేసిన ఇంటీరియర్ అండ్ అప్డేటెడ్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఫోక్స్ వ్యాగన్ ప్లాట్ పాంలో ని వెంటో మోడల్ ఆధారంగానే దీన్ని రూపొందించినప్పటికీ, అప్ డేటెడ్ వెర్షన్ లో స్కోడాకు అద్భుతమైన స్టైలిష్ లుక్ జతచేసింది. స్కోడా ఆటో ఇండియా 2011 లో లాంచ్ చేసిన ర్యాపిడ్ స్కోడాను భారీ మార్పులతో మొదటి సారిగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు పరిచయం చేస్తోంది. స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్ లో హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ డిజైన్‌తో ఆక్టావియా, సూపర్బ్ మోడల్స్ కంటే లుక్స్ లో ఆకట్టుకోనుంది. చాలావరకు స్కోడా ఫీచర్లనే పోలి ఉన్న ర్యాపిడ్ క్యాబిన్ లో కూడా భారీ మార్పులు చేసింది. హైట్ ఎడ్జస్టబుల్ సీట్, స్టీరింగ్ కోసం టిల్ట్ అండ్ టెలీ స్కోపిక్ ఎడ్జస్ట్ ఫెసిలిటీ అలాగే సెంట్రల్ హ్యాండ్ రెస్ట్ లతో పాటు టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం విత్ మిర్రర్ లాక్, ప్రస్తుత వేగం, పెట్రోల్ నిల్వ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి మల్టీ ఇన్ ఫర్మేషన్ ను అందిస్తుంది. అలాగే కొత్తగా డిజైన్ చేసిన రియర్ బంపర్ , ఇండికేటర్స్ తో కూడిన కొత్త వింగ్ మిర్రర్స్, యాంటెన్నా ప్రత్యేక ఆకర్షణ. దీనిప్రారంభ ధరను రూ.8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా కంపెనీ ప్రకటించింది. యాక్టివ్, యాంబిషన్ అండ్ స్టైల్ అనే మూడు వేరియంట్లలో వస్తున్న స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.8.27 -రూ.11. 36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) డీజిల్ వేరియంట్ రూ.9.48 -12. 67 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉండనుంది. 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వెర్షన్ లో 5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్ మిషన్ ఇంజీన్ అమర్చగా, పెట్రోల్ ఇంజీన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ , డీజిల్ లో 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ డీఎస్ జీ అమర్చింది. న్యూ లుక్ లో వస్తున్న ఈ స్కోడా రాపిడ్ మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా లతో పాటు సొంత ఫోక్స్ వ్యాగన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది -
ఆల్టో కె10 కొత్త వెర్షన్ లాంచ్ చేసిన ధోనీ
మినీ కారు సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునే లక్ష్యంతో మారుతి సుజుకీ ఆల్టో కె10 మోడల్లో సరికొత్త వెర్షన్‌ను హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ప్రముఖ క్రికెటర్ , కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేతులు మీదుగా గ్రాండ్ గా విడుదలైంది. కొత్తగా ముస్తాబైన సరికొత్త ఆల్టో కె10 ధర2. 5 లక్షల రూపాయల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు ఉండనుందని కంపెనీ ప్రకటించింది. కరెంట్ మోడల్ తో పోలిస్తే ఇది కొంచెం ధర ఎక్కువని తెలిపింది. ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ సదుపాయంతో, 7 సీట్లతో కొత్తగా లాంచ్ అయిన ఈ 'కూల్ ఆల్టో కె10' తమకు కీలకమైన ఉత్పత్తి కంపెనీ వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీ, విలువకు తగిన కారు కావాలనుకునే కస్టమర్లను ఇది ఆకట్టుకోనుందని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కల్సి తెలిపారు. ఈ సందర్భంగా ధోనీ తన బయోపిక్ ముచ్చట్లను పంచుకున్నారు. మరో వైపు ముత్యాల నగరం హైదరాబాద్ లో ధోనీ తమ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని కంపెనీ ట్వీట్ చేసింది. M.S. Dhoni @msdhoni has joined us at the venue in the City of Pearls, Hyderabad, to unveil the big surprise. @DhoniBiopic #DrivenByPassion — Alto 800 (@Alto_800) September 24, 2016