హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.31.99 లక్షలు. 2.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజన్, 7 స్పీడ్ డీఎస్‌జీ 4మోషన్ ట్రాన్స్‌మిషన్, ఐక్యూ లైట్‌తో ఇంటెలిజెంట్, అడాప్టివ్ ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, గెశ్చర్ కంట్రోల్‌తో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, యూఎస్‌బీ సి–పోర్ట్స్, వియెన్నా లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్‌సీ, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఏర్పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3 జోన్ క్లైమెట్రానిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment