ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జర్మన్ కార్‌మేకర్ ఫోక్స్ వ్యాగన్ ఇండియాలో మరో కొత్త కారును ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలో ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కారు కనీస ధర రూ. 11.21 లక్షలు ఉండగా హై ఎండ్ మోడల్ ధర రూ.17.92 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఆరు వేరియంట్లలో, ఆరు రంగుల్లో ఈ కారు లభించనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 152 షోరూమ్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది.
ఫీచర్లు
- క్యాబిన్ మరియు బూట్ స్పేస్ 526 లీటర్లు
- 20 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్
- 25.65 స్క్రీన్ ఇన్ఫోంటైన్‌మెంట్ సిస్టమ్
- యాప్ కనెక్టివిటీ ఫీచర్లు
- కీ లెస్ ఇంజన్ స్టార్ట్ , ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్
- 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు , 7 స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ మాన్యువల్/ఆటో టార్క్
- వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్టెక్స్ సిల్వర్, కుర్‌కుమా ఎల్లో, క్యాండీ వైట్, రైజింగ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
The New Volkswagen Virtus launched at a starting price of ₹ 11.21 Lakh. The striking, exhilarating, German-engineered marvel will be available in Dynamic and Performance variants.#TheNewVolkswagenVirtus #Sedan2022 #VolkswagenSedan #SedanIndia #VolkswagenIndia #Volkswagen pic.twitter.com/TiUPdEELCD
— Volkswagen India (@volkswagenindia) June 9, 2022
లోటు తీరేనా
ప్రస్తుతం ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎస్‌యూవీ, సబ్ ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇలా రకరకాలుగా మార్కెట్‌లోకి ఎస్‌యూవీలు వస్తున్నాయి. ఎస్‌యూవీల తర్వాత మల్టీ పర్పస్ వెహికల్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది. దీంతో సెడాన్ విభాగంలో కొత్త మోడళ్ల రాక బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్‌లెవల్‌లో ఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఫోక్స్‌వ్యాగన్ వర్చ్యూ పేరుతో కొత్త సెడాన్‌ను తెస్తోంది.
చదవండి: టాటా మోటార్స్ ‘ఈవీ’ రైడ్
Comments
Please login to add a commentAdd a comment