Volkswagen Virtus Sedan Enters India Book Of Records Over 150 Deliveries In Single Day - Sakshi
Sakshi News home page

Volkswagen Virtus Deliveries Record: ఈ విషయంలో ఈ కారు రికార్డు.. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

Published Wed, Jun 22 2022 6:51 PM | Last Updated on Wed, Jun 22 2022 8:00 PM

Volkswagen Virtus Sedan Made A Place In India Book Of Records About Record Deliveries - Sakshi

ఫోక్స్‌వ్యాగన్‌ తాజాగా రిలీజ్‌ చేసిన వర్చు కారు రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఇండియాలో ఏ సెడాన్‌ కారుకు సాధ్యం అరుదైన ఫీట్‌ను అవలీలాగా సాధించింది. దీంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సాధించింది. జర్మన్‌ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌ వ్యాగన్‌ ఇటీవల వర్చుస్‌ పేరుతో సరికొత్త సెడాన్‌ను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. మార్కెటింగ్‌ స్ట్రాటెజీగా రికార్డ్‌ మెగా డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా డీలర్లకు పిలుపునిచ్చింది.

ఫోక్స్‌ వ్యాగన్‌ మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో భాగంగా కేరళాకు చెందిన ఈవీఎం మోటార్స్‌ అండ్‌ వెహికల్స్‌ అనే డీలర్లు రికార్డు సృష్టించారు. జూన్‌ 9న కారు మార్కెట్‌లో రిలీజ్‌ అవగా అదే రోజు రికార్డు స్థాయిలో ఒకే డీలర్‌ నుంచి 150 సెడాన్‌ కార్లు డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించి ఒక సెడాన్‌ కారు ఒకే డీలర్‌ నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో డెలివరీలు జరగలేదు. దీంతో ఈ ఆరుదైన ఫీట్‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈవీఎం డీలర్లు 200ల వరకు వర్చుస్‌ కార్లను డెలివరీ చేయగలిగారు. ఫోక్స్‌వ్యాగన్‌ వర్చుస్‌ కారు ప్రారంభం ధర రూ.11.21 లక్షలు (ఎక్స్‌ షోరూం)గా ఉంది. 

చదవండి: ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్‌ ఊతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement