indian book of records
-
ఆరేళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. రెండున్నర నిమిషాల్లోనే..
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఒకటో తరగతి బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆరు సంవత్సరాల నాలుగు నెలల వయసు గల నాదెళ్ల దియాన్‡్ష 128 దేశాల జాతీయ జెండాలను చూసి రెండు నిమిషాల 25 సెకన్లలో గుర్తించి చెప్పాడు. గత నెల 12వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో దియాన్‡్ష ఈ ఘనత సాధించాడు. ఆ బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ సర్టిఫికెట్, మెడల్‌ను రెండు రోజుల క్రితం పంపారు. ఈ విషయాన్ని దియాన్‡్ష తల్లిదండ్రులు ప్రియాంక, గౌతంకృష్ణ శనివారం వెల్లడించారు. తమ కుమారుడు ఇప్పుడు 135 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తున్నాడని తెలిపారు. -
30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన
మేడ్చల్‌రూరల్: స్వతంత్ర భారత వజ్రోత్సవా లను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలాపనలో మల్లారెడ్డి వర్సిటీ రికార్డు సృష్టించింది. వర్సిటీకి ’ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’అవార్డు దక్కింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి వర్సిటీ క్రీడామైదానంలో మంగళవారం ఉదయం 11.30 గం.కు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరించి సెల్యూట్ చేయగా ఏకకాలంలో 30 వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వర్సిటీని ‘ఇండియన్ బుక్’ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి అవార్డును అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మంత్రి మల్లన్నకే సాధ్యమవుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన జన్మధన్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ విషయంలో ఈ కారు రికార్డు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఫోక్స్‌వ్యాగన్ తాజాగా రిలీజ్ చేసిన వర్చు కారు రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం అరుదైన ఫీట్‌ను అవలీలాగా సాధించింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఇటీవల వర్చుస్ పేరుతో సరికొత్త సెడాన్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. మార్కెటింగ్ స్ట్రాటెజీగా రికార్డ్ మెగా డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా డీలర్లకు పిలుపునిచ్చింది. ఫోక్స్ వ్యాగన్ మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో భాగంగా కేరళాకు చెందిన ఈవీఎం మోటార్స్ అండ్ వెహికల్స్ అనే డీలర్లు రికార్డు సృష్టించారు. జూన్ 9న కారు మార్కెట్లో రిలీజ్ అవగా అదే రోజు రికార్డు స్థాయిలో ఒకే డీలర్ నుంచి 150 సెడాన్ కార్లు డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించి ఒక సెడాన్ కారు ఒకే డీలర్ నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో డెలివరీలు జరగలేదు. దీంతో ఈ ఆరుదైన ఫీట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈవీఎం డీలర్లు 200ల వరకు వర్చుస్ కార్లను డెలివరీ చేయగలిగారు. ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ కారు ప్రారంభం ధర రూ.11.21 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. చదవండి: ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం -
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో బాలయ్య
-
భళా అకీరా నందన్.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
ఆలూరు రూరల్: పిట్ట కొంచం.. కూత ఘనం.. అన్న సామెత ఈ బుడతడికి సరిగ్గా సరిపోతుంది. చదివేది ఎల్కేజీ అయినా 11 తెలుగు ప్రాసలు నేర్చుకున్నాడు. దేవుని శ్లోకాలు, తెలుగు పద్యాలు చక్కగా వల్లె వేస్తున్నాడు. ఇంగ్లిష్ వర్ణమాల, ఆంగ్ల నెలలు, జాతీయ చిహ్నాలు, రుతువుల పేర్లు, జంతువుల పేర్లను చకచకా చెప్పేస్తున్నాడు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు టక్కున సమాధానమిచ్చేస్తాడు. తన ప్రతిభతో మూడేళ్ల వయసులోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (ఐబీఆర్)లో స్థానం సంపాదించాడు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రిక, ప్రశాంత్ కుమార్ దంపతుల కుమారుడు అకీరా నందన్. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదుతున్నాడు. బాలుడికి తల్లి రోజూ దినపత్రికల్లో వచ్చే వార్తల్లోని ముఖ్యాంశాలను చదివి వినిపించేది. తల్లి చెప్పే ఏ విషయాన్ని అయినా ఇట్టే పట్టేసి నేర్చుకునేవాడు అకీరా. బాలుడి మేధాశక్తిని గమనించిన తల్లిదండ్రులు అతని ప్రతిభను వీడియోలలో రికార్డు చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. ఐబీఆర్ నిర్వాహకులు అకీరాకు మే నెల 20వ తేదీన ఆన్లైన్లో టెస్టు నిర్వహించి బాలుడి పేరిట రికార్డు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెడల్, సర్టిఫికెట్‌ను నిర్వాహకులు పోస్ట్ ద్వారా బాలుడికి పంపారు. -
రికార్డుల చిన్నోడు.. 60 నిముషాల్లో 150 వంటలు
ఒక పూట ఇంట్లో వండుకుని తినాలంటే బద్దకిస్తాం. అటువంటిది మూడో తరగతి చదువుతున్న బుడ్డోడు మాత్రం గంటలో 150 కుపైగా వంటకాలు చేసి ఔరా అనిపించాడు. కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్ అబ్దుల్లా ఇలా వంటలు చేసి రికార్డు సృష్టించాడు. బిరియానీలు, జ్యూస్‌లు, పాన్కేక్లు, దోశలు, సలాడ్లు, మిల్క్ షేక్స్, చాక్లెట్స్ వంటి వంటలను కేవలం అరవై నిమిషాల్లోనే వండడం ద్వారా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ద ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ‘‘హయాన్‌కు నాలుగేళ్లున్నప్పుడే కుకింగ్ ఒక అలవాటుగా ఉండేదని, వంటచేయాలన్న ఆసక్తితోనే కిచెన్‌లో నాకు సాయపడేవాడని’’ హయాన్ తల్లి రశా అబ్దుల్లా చెప్పారు. ‘‘వంటలు చేయాలన్న నా అభిరుచి గురించి తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్లకు కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే అమ్మనాన్న కేరళలో పుట్టిపెరిగినప్పటకీ చెన్నైలో అనేక రెస్టారెంట్లను నడుపుతున్నారు. అందుకే వారు నా ఆసక్తిని మొదట్లో పట్టించుకోక పోయినప్పటికీ.. తరువాత నేను వేగంగా వంటచేయడాన్ని గమనించి.. స్పీడ్‌గా వంటచేయడంతోపాటు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమని ప్రోత్సహించారు. దీంతో నేను మరింత వేగంగా వంట చేయడం మొదలు పెట్టానని’’ హయాన్ చెప్పాడు. అయితే నేను ఒక్కో డిష్ వండడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి టైమ్‌ను రికార్డు చేసేవాడిని. అలా చేయడం వల్లే వంటల పోటీలో ఎటువంటి ప్రిపరేషన్ లేకపోయినప్పటికీ గెలవగలిగానని చెప్పాడు. ప్రస్తుతం హయాన్ చెన్నైలోని షేర్వుడ్ హాల్ సీనియర్ సెకండరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతనికి సొంత యూ ట్యూబ్ చానల్ కూడా ఉంది. ‘హయాన్ డెలీకసీ’ పేరుతో ఉన్న చానల్లో వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తుంటాడు హయాన్. ఇంత స్పీడ్‌గా వంటలు చేస్తున్న హయాన్ భవిష్యత్తులో పైలట్ కావాలనుకుంటున్నాడు. అంతేగాక మంచి రెస్టారెంట్స్, పాస్తా బార్‌ను ఏర్పాటు చేయడం తన కల అని కూడా హయాన్ చెప్పాడు. చదవండి: ముగ్గురూ ముగ్గురే -
నెక్నాంపూర్ చెరువుకి అరుదైన గుర్తింపు
మణికొండ : హైదరాబాద్ నగర శివారులోని గండిపేట మండలం నెక్నాంపూర్ చిన్నచెరువు ఇండియాబుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. చెరువులో అత్యధికంగా 3వేల చదరపు అడుగుల కదిలే మొక్కల భూమి (ఫ్లోటింగ్ ఐలాండ్)ను ఏర్పాటు చేసి అందులో ఏకంగా 3500 మొక్కలను నాటడంతో ఆ ఘనత దక్కింది. చెరువును దత్తత తీసుకుని దాని అభివృద్ధికి కృషి చేస్తున్న ధృవాన్‡్ష స్వచ్ఛంద సంస్థ వాటిని ఏర్పాటు చేయటంతో శుక్రవారం చెరువు వద్ద జరిగిన ప్రపంచ తడినేల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ధరణి అవార్డును స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ధృవాన్‡్ష స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మధుళిక మాట్లాడుతూ.. నెక్నాంపూర్ చిన్న చెరువును మూడు సంవత్సరాల క్రితం దత్తత తీసుకుని చెరువు చుట్టూరా మొక్కలు నాటడం, చెరువు నీటిని శుద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేశామన్నారు. చెరువులో థర్మకోల్పై కదిలే భూమిని ఏర్పాటు చేసి అందులో మొక్కలను నాటడం వలన చెరువు మలినాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. మురికినీటిని శుద్ధి చేసేందుకు సహజంగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారని వాటితోనూ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఓ ఐలాండ్‌పై కూరగాయలు సైతం అయ్యాయని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు, భూపాల్లలోని చెరువుల్లో ఇలాంటివి చిన్న సైజులో ప్రయోగం చేశారని దాంతో తాను ఏకంగా 3వేల చదరపు అడుగుల ఫ్లోటింగ్ ఐలాండ్‌ను ఏర్పాటు చేయటంతో దాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ డైరెక్టర్ ఎస్. శ్రీనివాస్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్ ఉశేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెరువులో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ ఐలాండ్ -
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగోడు
విజయవాడ: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విజయవాడకు చెందిన చెరుకూరి సత్యనారాయణ స్థానం సంపాదించాడు. ఆయన విజయవాడలో చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీని నిర్వహిస్తున్నాడు. నగరంలో పలువురు విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారు. అయితే, ఆదివారం విజయవాడలో ఆయన తన 39మంది శిష్యులతో కలిసి పాల్గొన్న ఒక ఈవెంట్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ మేరకు నిర్వాహకుల నుంచి ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.