రికార్డుల చిన్నోడు.. 60 నిముషాల్లో 150 వంటలు | 9Years Old Hayaan Abdulla Cooks 150 Vareities Of Dishes In One Hour | Sakshi
Sakshi News home page

రికార్డుల చిన్నోడు.. 60 నిముషాల్లో 150 వంటలు

Published Sat, Feb 20 2021 12:24 AM | Last Updated on Sat, Feb 20 2021 12:47 PM

9Years Old Hayaan Abdulla Cooks 150 Vareities Of Dishes In One Hour - Sakshi

ఒక పూట ఇంట్లో వండుకుని తినాలంటే బద్దకిస్తాం. అటువంటిది మూడో తరగతి చదువుతున్న బుడ్డోడు మాత్రం గంటలో 150 కుపైగా వంటకాలు చేసి ఔరా అనిపించాడు. కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్‌ అబ్దుల్లా ఇలా వంటలు చేసి రికార్డు సృష్టించాడు. బిరియానీలు, జ్యూస్‌లు, పాన్‌కేక్‌లు, దోశలు, సలాడ్లు, మిల్క్‌ షేక్స్, చాక్లెట్స్‌ వంటి వంటలను కేవలం అరవై నిమిషాల్లోనే వండడం ద్వారా ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ద ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ‘‘హయాన్‌కు నాలుగేళ్లున్నప్పుడే కుకింగ్‌ ఒక అలవాటుగా ఉండేదని, వంటచేయాలన్న ఆసక్తితోనే కిచెన్‌లో నాకు సాయపడేవాడని’’ హయాన్‌ తల్లి రశా అబ్దుల్లా చెప్పారు.

‘‘వంటలు చేయాలన్న నా అభిరుచి గురించి తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్లకు కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే అమ్మనాన్న కేరళలో పుట్టిపెరిగినప్పటకీ చెన్నైలో అనేక రెస్టారెంట్లను నడుపుతున్నారు. అందుకే వారు నా ఆసక్తిని మొదట్లో పట్టించుకోక పోయినప్పటికీ.. తరువాత నేను వేగంగా వంటచేయడాన్ని గమనించి.. స్పీడ్‌గా వంటచేయడంతోపాటు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమని ప్రోత్సహించారు. దీంతో నేను మరింత వేగంగా వంట చేయడం మొదలు పెట్టానని’’ హయాన్‌ చెప్పాడు. అయితే నేను ఒక్కో డిష్‌ వండడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి టైమ్‌ను రికార్డు చేసేవాడిని. అలా చేయడం వల్లే వంటల పోటీలో ఎటువంటి ప్రిపరేషన్‌ లేకపోయినప్పటికీ గెలవగలిగానని చెప్పాడు. 

ప్రస్తుతం హయాన్‌ చెన్నైలోని షేర్‌వుడ్‌ హాల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతనికి సొంత యూ ట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. ‘హయాన్‌ డెలీకసీ’ పేరుతో ఉన్న చానల్‌లో వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తుంటాడు హయాన్‌. ఇంత స్పీడ్‌గా వంటలు చేస్తున్న హయాన్‌ భవిష్యత్తులో పైలట్‌ కావాలనుకుంటున్నాడు. అంతేగాక మంచి రెస్టారెంట్స్, పాస్తా బార్‌ను ఏర్పాటు చేయడం తన కల అని కూడా హయాన్‌ చెప్పాడు. 
చదవండి: 
ముగ్గురూ ముగ్గురే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement