
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఒకటో తరగతి బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆరు సంవత్సరాల నాలుగు నెలల వయసు గల నాదెళ్ల దియాన్‡్ష 128 దేశాల జాతీయ జెండాలను చూసి రెండు నిమిషాల 25 సెకన్లలో గుర్తించి చెప్పాడు.
గత నెల 12వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలో దియాన్‡్ష ఈ ఘనత సాధించాడు. ఆ బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ సర్టిఫికెట్, మెడల్‌ను రెండు రోజుల క్రితం పంపారు. ఈ విషయాన్ని దియాన్‡్ష తల్లిదండ్రులు ప్రియాంక, గౌతంకృష్ణ శనివారం వెల్లడించారు. తమ కుమారుడు ఇప్పుడు 135 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తున్నాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment