మీరు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కారు లోపల టెంపరేచర్ విపరీతంగా ఉంది. వెంటనే మీకు ‘ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్’ అనే సౌండ్ వినబడుతుంది.
మీరు అదే కారులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే మీకు నోరూరించే బటర్ చికెన్ తినాలనిపిస్తుంది. వెంటనే సమీపంలో ఉన్న రెస్టారెంట్ ఎక్కుడ ఉంది? అని వెతికే పనిలేకుండా సంబంధిత రెస్టారెంట్ పిన్ కోడ్, అడ్రస్‌తో సహా అన్నీ వివరాలు మీకు వాయిస్ రూపంలో అందుతాయి.
అలెక్సా తరహాలో
రానున్న రోజుల్లో వోక్స్‌వ్యాగన్ కార్ల యజమానులకు పై తరహా ఏఐ టెక్నాలజీ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. వోక్స్‌వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తూ (అలెక్సా తరహా) వాయిస్ అసిస్టెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.
అమెరికా లాస్ వేగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో చాట్‌జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌పై ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2 నాటికి కార్లలో వోక్స్‌వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీ వాయిస్ ఓవర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని, తొలుత నార్త్ అమెరికా, యూరప్ కస్టమర్లు ఈ ఫీచర్‌ను వినియోగించుకునే సౌకర్యం కలగనుంది.
టచ్ స్క్రీన్‌ను తాకే పనిలేకుండా
సాధారణంగా ఏదైనా ఫీచర్‌ను వినియోగించాలంటే కార్లలో టచ్ స్క్రీన్‌ను తాకాల్సి ఉంటుంది. వోక్స్‌వ్యాగన్ అందించనున్న ఫీచర్‌తో ఆ అవసరం ఉండదని ఆ సంస్థ టెక్నికల్ డెవలప్‌మెంట్ బ్రాండ్ బోర్డ్ మెంబర్ కై గ్రునిట్జ్ తెలిపారు.
వోక్స్‌వ్యాగన్ తన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చిన మొదటి తయారీ సంస్థ తమదేనని తెలిపింది. అయితే, ఇప్పటికే జనరల్ మోటార్స్ గత మార్చిలో చాట్‌జీపీటీ ఏఐ మోడల్‌లను ఉపయోగించి వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది
మెర్సిడెజ్ బెంజ్ కార్లతో పాటు
మెర్సిడెజ్ బెంజ్ గత జూన్‌లో ఒక టెస్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించి, ఆటోమేకర్ యొక్క ‘ఎంబీయూఎక్స్’ సిస్టమ్‌ను కలిగి ఉన్న సుమారు 900,000 కార్లలో చాట్‌జీపీటీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిచ్చింది. వినియోగదారులు దృష్టిలో ఉంచుకుని సినిమాలు చూడడం, రెస్టారెంట్లలలో సీట్లను బుక్ చేసుకోవడం, డ్రైవింగ్ సమయంలో అలెర్ట్‌లను ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment