వామ్మో 1890 సీసీ ఇంజిన్‌.. రూ.72 లక్షల బైక్‌ విడుదల | Indian Roadmaster Elite With 1890cc Engine Launched In India, Check Price Details And Specifications | Sakshi

వామ్మో 1890 సీసీ ఇంజిన్‌.. రూ.72 లక్షల బైక్‌ విడుదల

Aug 2 2024 6:53 PM | Updated on Aug 2 2024 8:03 PM

Indian Roadmaster Elite with 1890cc engine launched in India

దేశంలో మరో ఖరీదైన బైక్‌ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.

రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్‌టైన్, స్ప్రింగ్‌ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.

రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలు

  • పూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్  డీప్‌ రెడ్‌, బ్లాక్‌ రంగులపై గోల్డ్‌ హైలైట్‌లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.

  • ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్‌లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్‌లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.

  • రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్‌ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.

  • హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్‌ ట్యాంక్ ఉంది.

  • ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్‌ఫుల్‌ ఇంజన్‌ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement