టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్‌ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్‌టీఆర్ 310 లాగే ఉంటుంది.
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్‌ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్‌లెట్‌లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్‌కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్‌తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్‌పీ, 29ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్‌బాక్స్‌ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.
యూఎస్‌డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివరల డిస్క్ బ్రేక్‌లు, రైడ్ మోడ్‌లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను కూడా వీటిలో చేర్చింది. అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.
ధరలు
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్‌షిఫ్టర్‌తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్‌లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment