Indian Motorcycle
-
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' త్వరలోనే '2024 రోడ్‌మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్‌సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్‌స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
మార్కెట్లోకి సరికొత్త బైక్: ధర రూ.48లక్షలు
సాక్షి, ముంబై: ఇండియన్ మోటార్స్ సైకిల్స్ సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. పోలారి ఇండస్ట్రీస్ సొంతమైన ఇండియన్ మోటార్ సైకిల్ రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ. 48 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వద్ద ప్రారంభించింది.బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై 23 క్యారెట్ గోల్డ్ లీఫ్ బ్యాడ్జింగ్‌ను రూపొందించడం ప్రధాన ఆకర్షణ. 1811 ఇంజీన్ సిసి థండర్ స్ర్టోక్ వి-ట్విన్ ఇంజన్‌ను ఈ బైక్ కలిగి ఉంది. ఈ ఏడాదిలో 60-70 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఇందుకోసం నెట్వర్క్ విస్తరణను చేపట్టనున్నామని ఇండియన్ మోటార్‌సైకిల్ మాతృ సంస్థ పోలారిస్ ఇండస్ర్టీస్ భారత అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ హెడ్ పంకజ్ దూబే తెలిపారు. డ్యుయల్ టోన్ క్యాండీ పెయింట్ ఈ బైక్ ప్రత్యేకత అని చెప్పారు. రిమోట్ - లాకింగ్ హార్డ్ సాడిల్ బ్యాగ్స్, 36 కిలో కార్గో స్పేస్, ఏబీఎస్ బ్రేక్స్, పుష్ - బటన్ పవర్ విండ్‌షీల్డ్, పిన్నాకిల్ మిర్రర్స్ , ప్రీమియం టూరింగ్ సాడిల్, ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్ ఇతర ప్రధాన స్పెసిఫికేషన్లు ఉన్నాయి -
భారత్‌లోకి ‘స్కాట్ బాబర్’ మోడల్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్స్ తయారీ కంపెనీ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తాజాగా ‘స్కాట్ బాబర్’ మోడల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలో దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలు. ఇందులో 1,133 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పొలారిస్ ఇండియా కంట్రీ హెడ్, ఎండీ పంకజ్ దూబే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కాట్ బాబర్ చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అద్భుతమైన పనితీరుతో ఇండియన్ మోటార్‌సైకిల్ పేరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాగా పొలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థే ఇండియన్ మోటార్ సైకిల్. ఇది అమెరికా తొలి మోటార్‌సైకిల్ కంపెనీ. -
ఇప్పుడు ఇండియన్ మోటార్‌సైకిల్ వంతు..
వాహన ధరలు రూ.2.21 లక్షల వరకు తగ్గింపు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్ బ్రాండ్ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తాజాగా తన మూడు మోడళ్ల ధరలను రూ.2.21 లక్షల వరకు (9–12 శాతం శ్రేణిలో) తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇండి యన్ మోటార్‌సైకిల్ బైక్స్‌ను పొలారిస్ ఇండియా విక్రయిస్తోంది. ధరల తగ్గింపును పరిశీలిస్తే.. ⇔ ఇండియన్ స్కౌట్ మోడల్ ధర జీఎస్టీకి ముందు రూ.14.75 లక్షలుగా ఉంది. ప్రస్తుతం దీని రేటు 12 శాతం తగ్గింది. ఈ బైక్ ఇప్పుడు రూ.12.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. ⇔ ఇండియన్ డార్క్ హార్స్ మోడల్ ధర 9 శాతం తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.21.25 లక్షలుగా ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర రూ.23.4 లక్షలుగా ఉంది. ⇔ ఇండియన్ చీఫ్ క్లాసిక్ మోడల్ ఇప్పుడు రూ.21.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. దీని ధర ఇదివరకు రూ.24.2 లక్షలుగా ఉంది. అంటే ధర 9 శాతం తగ్గింది. -
భారీగా ధర తగ్గిన సూపర్ బైక్స్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం లగ్జరీ బైకుల ఇండియన్ మోటార్ సైకిల్ భారత్‌లో తన సూపర్ బైక్‌లను భారీగా తగ్గించింది. ఇండియాలో జీఎస్టీ అమలు నేపథ్యంలో అమెరికా కల్ట్ బైక్ బ్రాండ్ ఇండియన్ మోటార్ సైకిల్ మూడు మోడళ్ల ధరలపై భారీ తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఇండియన్ స్కౌట్, ఇండియన్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ క్లాసిక్ మూడు మోడళ్ల ధరల తగ్గింపు 9 నుంచి12 శాతం తగ్గించిందని ఇండియన్ మోటార్‌సైకిల్ బైక్‌ల విక్రయ సంస్థ పోలారిస్ ఇండియా వెల్లడించింది. ఇండియన్ స్కౌట్ మోడల్ ధర 12 శాతానికి తగ్గుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం రూ. 14.75 లక్షల నుంచి రూ. 12.99లక్షల కు లభ్యంకానుంది. అదేవిధంగా ఇండియన్ డార్క్ హార్స్ మోడల్ 9 శాతం తగ్గింపు అనంతరం ఇప్పుడు రూ .21.25 లక్షకే అందుబాటులోఉండనుంది. అసలు ధర రూ. 23.4 లక్షలు. జిఎస్టి కాలంలో భారతీయ చీఫ్ క్లాసిక్ మోడల్ ధర రూ .21.99 లక్షలుగా ఉంది. రూ .24.2 లక్షల నుంచి 9.2 శాతం తగ్గించింది. భారతీయ మోటార్ సైకిల్ భారతదేశంలో మొత్తం తొమ్మిది మోడల్స్‌ను వి విక్రయిస్తుంది. కాగా జూలై 1 నుంచి దేశంలో జీఎస్టీ పన్నుల రేటు అమల్లోకిరావడంతో వివిధ కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు జిఎస్టీ ప్రయోజనాలను అందించే లక్ష్యంతో ధరలను తగ్గించాయి. టాటా మోటార్స్, రెనాల్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్, మారుతి సుజుకి, టొయోటా జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్డి, మెర్సిడెస్ బెంజ్, ఆడి కూడా తమ కార్ల ధరలను తగ్గించాయి. అలాగే హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, సుజుకి మోటార్‌సైకిల్స్ లాంటి ఇతర ద్విచక్ర వాహన తయారీదారులు తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ మార్కెట్లోకి ఇండియన్ స్కౌట్ సిక్స్టి