గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' త్వరలోనే '2024 రోడ్‌మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.
ఇండియన్ మోటార్‌సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్‌స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్‌స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్‌ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి.
కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్‌లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్!
Comments
Please login to add a commentAdd a comment