దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్‌లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.
హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్‌ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.
Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle.
Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024
Comments
Please login to add a commentAdd a comment