
ఇప్పుడు ఇండియన్ మోటార్‌సైకిల్ వంతు..
వాహన ధరలు రూ.2.21 లక్షల వరకు తగ్గింపు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్ బ్రాండ్ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తాజాగా తన మూడు మోడళ్ల ధరలను రూ.2.21 లక్షల వరకు (9–12 శాతం శ్రేణిలో) తగ్గించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇండి యన్ మోటార్‌సైకిల్ బైక్స్‌ను పొలారిస్ ఇండియా విక్రయిస్తోంది. ధరల తగ్గింపును పరిశీలిస్తే..
⇔ ఇండియన్ స్కౌట్ మోడల్ ధర జీఎస్‌టీకి ముందు రూ.14.75 లక్షలుగా ఉంది. ప్రస్తుతం దీని రేటు 12 శాతం తగ్గింది. ఈ బైక్ ఇప్పుడు రూ.12.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది.
⇔ ఇండియన్ డార్క్ హార్స్ మోడల్ ధర 9 శాతం తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.21.25 లక్షలుగా ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర రూ.23.4 లక్షలుగా ఉంది.
⇔ ఇండియన్ చీఫ్ క్లాసిక్ మోడల్ ఇప్పుడు రూ.21.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. దీని ధర ఇదివరకు రూ.24.2 లక్షలుగా ఉంది. అంటే ధర 9 శాతం తగ్గింది.