
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్స్ తయారీ కంపెనీ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తాజాగా ‘స్కాట్ బాబర్’ మోడల్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దేశంలో దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలు. ఇందులో 1,133 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పొలారిస్ ఇండియా కంట్రీ హెడ్, ఎండీ పంకజ్ దూబే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కాట్ బాబర్ చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అద్భుతమైన పనితీరుతో ఇండియన్ మోటార్‌సైకిల్ పేరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాగా పొలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థే ఇండియన్ మోటార్ సైకిల్. ఇది అమెరికా తొలి మోటార్‌సైకిల్ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment