Tiguan
-
ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.31.99 లక్షలు. 2.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్, 7 స్పీడ్ డీఎస్జీ 4మోషన్ ట్రాన్స్మిషన్, ఐక్యూ లైట్‌తో ఇంటెలిజెంట్, అడాప్టివ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, గెశ్చర్ కంట్రోల్‌తో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, యూఎస్బీ సి–పోర్ట్స్, వియెన్నా లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఏర్పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3 జోన్ క్లైమెట్రానిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. -
మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ ‘టిగువన్’
ధర శ్రేణి రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘టిగువన్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీలో 7 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్జీ గేర్‌బాక్స్‌తో కూడిన 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చింది. తమ గ్లోబల్ బెస్ట్ సెల్లర్ మోడల్ అయిన ‘టిగువన్’ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చామని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ (సేల్స్) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పియాచ్క్ తెలిపారు. సేఫ్టీ, లగ్జరీ, స్టైల్, పనితీరు వంటి ఫీచర్ల సమాహారంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ ఆధారిత 4మోషన్ ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కంపెనీ నుంచి భారత్‌లోకి వస్తున్న తొలి కారు ఇదని తెలిపారు. ‘టిగువన్’ ఎస్యూవీ దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్షిప్స్ వద్ద కంఫర్ట్‌లైన్, హైలైన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
ఫోక్స్‌వాగన్ కొత్త ఎస్యూవీ లాంచ్
జర్మనీ కార్ మేకర్ ఫోక్స్‌వాగన్ ఇండియా తనకొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి వాహనాన్ని బుధవారం లాంచ్ చేసింది. టిగ్వాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారును రెండు వేరియంట్లలోలాంచ్ చేసింది. కంఫర్ట్ లైన్ రూ .27.68 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై)లుగాను, హై లైన్ రూ .31.04 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లుగా నిర్ణయించింది. 4 మోషన్ టెక్రాలజీ లాంటి డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్‌తో పాటు మాడ్యులర్ ట్నాన్స్వెర్జ్ ఎంక్యూబీ ప్లాట్‌ఫాంలో 2791, 4704ఎంఎం 2.0లీటర్ల డీజిల్ ఇంజీన్, 7 స్పీడ్ డీఎస్ జీ గేర్ బాక్స్ 147 బీహెచ్పవర్ 340 ఎన్ఎం టాప్ టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రో యాంటి స్లీప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఇంజన్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ సిస్టమ్ అమర్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్కొడా ప్లాంట్‌లో దీన్ని రూపొందించిది. ఢిల్లీ ఆటో ఎక్స్ పో 2016 లో ఫోక్స్ వ్యాగన్ మొట్టమొదటిసారి టిగువాన్ ప్రదర్శించింది. ఆడి 3కి పోలిన ఈ కొత్త కారు టయోటా ఫార్చ్యునర్, ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మరొక అంతర్గత ప్రత్యర్థి స్కోడా రాబోయే మోడల్ కోడియాక్ కు గట్టి పోటీగానిలవనుందని అంచనా. దేశీయంగా తమకు ఎస్యూవీ సెగ్మెంట్లో భారీ డిమాండ్‌ను టిగువాన్ తీరుస్తుందని సంస్థ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ గతంలో చెప్పారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.