ఫోక్స్‌వాగన్ కొత్త ఎస్‌యూవీ లాంచ్
జర్మనీ కార్ మేకర్ ఫోక్స్‌వాగన్ ఇండియా తనకొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి వాహనాన్ని బుధవారం లాంచ్ చేసింది. టిగ్వాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారును రెండు వేరియంట్లలోలాంచ్ చేసింది.
కంఫర్ట్ లైన్ రూ .27.68 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై)లుగాను, హై లైన్ రూ .31.04 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లుగా నిర్ణయించింది. 4 మోషన్ టెక్రాలజీ లాంటి డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్‌తో పాటు మాడ్యులర్ ట్నాన్స్‌వెర్జ్ ఎంక్యూబీ ప్లాట్‌ఫాంలో 2791, 4704ఎంఎం 2.0లీటర్ల డీజిల్ ఇంజీన్, 7 స్పీడ్ డీఎస్ జీ గేర్ బాక్స్ 147 బీహెచ్‌పవర్ 340 ఎన్‌ఎం టాప్ టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రో యాంటి స్లీప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఇంజన్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ సిస్టమ్ అమర్చింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్కొడా ప్లాంట్లో దీన్ని రూపొందించిది. ఢిల్లీ ఆటో ఎక్స్ పో 2016 లో ఫోక్స్ వ్యాగన్ మొట్టమొదటిసారి టిగువాన్ ప్రదర్శించింది. ఆడి 3కి పోలిన ఈ కొత్త కారు టయోటా ఫార్చ్యునర్, ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మరొక అంతర్గత ప్రత్యర్థి స్కోడా రాబోయే మోడల్ కోడియాక్ కు గట్టి పోటీగానిలవనుందని అంచనా. దేశీయంగా తమకు ఎస్‌యూవీ సెగ్మెంట్లో భారీ డిమాండ్‌ను టిగువాన్ తీరుస్తుందని సంస్థ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ గతంలో చెప్పారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.