కొత్త ఫీచర్లతో సరికొత్తగా అప్‌డేట్ చేసిన 7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్‌ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ను రూ. 14.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ను రూ.15.99 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన అప్‌డేట్‌తోనైనా ఈ ఎస్‌యూవీ నెలవారీ విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విభాగంలో టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, కియా కారెన్స్ వంటివి దీనికి పోటీగా ఉన్నాయి.
2024 హ్యుందాయ్ అల్కాజార్ లుక్స్ పరంగా క్రెటాను సాగదీసినట్లుగా ఉంటుంది. హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పెద్ద రేడియేటర్ గ్రిల్ , విశాలమైన స్కఫ్ ప్లేట్‌తో బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్‌తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్ ఇందులో ఇచ్చారు. ఇక వాహనం ఇరువైపులా చేసిన పెద్ద మార్పులు ఏంటంటే.. కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్.
ఆల్కాజర్ రియర్ ఫేస్ కూడా కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్‌తో భారీగా సర్దుబాట్లు చేశారు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లతో కనెక్ట్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కూడా దీనికి ఇచ్చారు. కొలతల విషయానికొస్తే, అల్కాజర్ అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోల్చితే 2024 ఆల్కాజర్ 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటాయి. 2,760 ఎంఎం వీల్‌బేస్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్‌లోనూ డ్యాష్‌బోర్డ్‌తోపాటు మరికొన్ని మార్పులు చేశారు.
అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5లీటర్ డీజిల్, 1.5లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికలు, మూడు డ్రైవ్ మోడ్‌లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్‌లు (స్నో, మడ్, శాండ్) ఉన్నాయి. కొత్త బోల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ 9 రంగులలో లభిస్తుంది. వీటిలో 8 మోనో-టోన్ ఎంపికలు అవి కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాటీ, టైటాన్ గ్రే మ్యాటీ, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫైరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, ఒక డ్యూయల్- బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్‌లో టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment