స్టైలిష్ లుక్లో స్కోడా ర్యాపిడ్ | Skoda Rapid Facelift launching in India today | Sakshi
Sakshi News home page

స్టైలిష్ లుక్లో స్కోడా ర్యాపిడ్

Published Thu, Nov 3 2016 2:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

స్టైలిష్ లుక్లో స్కోడా  ర్యాపిడ్

స్టైలిష్ లుక్లో స్కోడా ర్యాపిడ్

ఆటోమొబైల్ తయారీదారు స్కోడా తన తాజా స్కోడా ర్యాపిడ్ ను   న్యూ లుక్  లో భారత మార్కెట్ లో  గురువారం లాంచ్ చేయనుంది.   ర్యాపిడ్ ఫేస్‌ లిఫ్ట్ లో పూర్తిగా అభివృద్ది చేసిన ఇంటీరియర్ అండ్ అప్‌డేటెడ్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది.  ఫోక్స్ వ్యాగన్  ప్లాట్ పాంలో ని  వెంటో మోడల్  ఆధారంగానే దీన్ని  రూపొందించినప్పటికీ, అప్ డేటెడ్ వెర్షన్ లో స్కోడాకు  అద్భుతమైన  స్టైలిష్ లుక్ జతచేసింది. స్కోడా ఆటో ఇండియా 2011 లో  లాంచ్ చేసిన ర్యాపిడ్ స్కోడాను  భారీ మార్పులతో మొదటి సారిగా ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో నేడు పరిచయం  చేస్తోంది.  స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్ లో  హెడ్ ల్యాంప్స్,  ఫ్రంట్ డిజైన్‌తో ఆక్టావియా, సూపర్బ్ మోడల్స్ కంటే లుక్స్ లో  ఆకట్టుకోనుంది.

 చాలావరకు స్కోడా  ఫీచర్లనే పోలి ఉన్న ర్యాపిడ్  క్యాబిన్ లో కూడా భారీ మార్పులు చేసింది.   హైట్ ఎడ్జస్టబుల్ సీట్,  స్టీరింగ్ కోసం టిల్ట్ అండ్ టెలీ స్కోపిక్ ఎడ్జస్ట్  ఫెసిలిటీ అలాగే  సెంట్రల్ హ్యాండ్ రెస్ట్ లతో పాటు టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం విత్ మిర్రర్ లాక్,  ప్రస్తుత వేగం,  పెట్రోల్ నిల్వ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి మల్టీ ఇన్ ఫర్మేషన్ ను అందిస్తుంది. అలాగే కొత్తగా  డిజైన్ చేసిన రియర్ బంపర్ ,  ఇండికేటర్స్ తో కూడిన  కొత్త  వింగ్ మిర్రర్స్,   యాంటెన్నా  ప్రత్యేక ఆకర్షణ.

దీనిప్రారంభ ధరను రూ.8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా కంపెనీ ప్రకటించింది.   యాక్టివ్, యాంబిషన్ అండ్ స్టైల్ అనే మూడు వేరియంట్లలో వస్తున్న  స్కోడా ర్యాపిడ్  పెట్రోల్ వేరియంట్ ధర రూ.8.27 -రూ.11. 36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  డీజిల్ వేరియంట్ రూ.9.48 -12. 67 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  మధ్య  ఉండనుంది.
 1.6 లీటర్ పెట్రోల్,  1.5 లీటర్ల డీజిల్  వెర్షన్ లో  5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్ మిషన్  ఇంజీన్  అమర్చగా, పెట్రోల్ ఇంజీన్, 6 స్పీడ్ టార్క్   కన్వర్టర్ , డీజిల్ లో 7  స్పీడ్ డ్యుయల్ క్లచ్ డీఎస్ జీ అమర్చింది. న్యూ లుక్ లో వస్తున్న ఈ  స్కోడా రాపిడ్ మారుతి సుజుకి  సియాజ్,  హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా లతో పాటు సొంత ఫోక్స్ వ్యాగన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement