నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ‘తండేల్’ లోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేయనున్నాను.
‘‘శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్యాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్‌గా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment